Breaking News

కాపుల డిక్లరేషన్‌ ఎప్పుడు పవన్‌? 

Published on Thu, 03/07/2024 - 02:47

పాలకొల్లు సెంట్రల్‌: జనాభాలో 52 శాతం ఉన్న బీసీలకు జయహో బీసీ అంటూ పది హామీలతో బీసీ డిక్లరేషన్‌ ప్రకటించారు సరే.. మరి కాపుల డిక్లరేషన్‌ ఎప్పుడు ప్రకటిస్తారని మాజీ ఎంపీ, రాజకీయ విశ్లేషకుడు చేగొండి హరిరామజోగయ్య ప్రశ్నించారు. బుధవారం ‘జయహో కాపూస్‌ జయహో బీసీస్‌’ అంటూ ఇచ్చిన బీసీ డిక్లరేషన్‌ సరే, కాపుల డిక్లరేషన్‌ ఎప్పుడంటూ జోగయ్య ఓ లేఖ విడుదల చేశారు. 52 శాతం ఉన్న బీసీలకు డిక్లరేషన్‌ ప్రకటించడం ఆహ్వానించదగ్గ విషయమేనని, కాపులకూ డిక్లరేషన్‌ ఎప్పుడు ప్రకటిస్తారో కూడా తెలియజేయాల్సిందని సూచించారు.

మంగళగిరిలో ఏర్పాటుచేసిన జయహో బీసీ సభలో చంద్రబాబు, పవన్‌లు బీసీ డిక్లరేషన్‌ పేరుతో 10 ఎన్నికల హామీలిచ్చారని, ఇందులో పవన్‌ తన వంతుగా బీసీలకు రాజ్యాధికారం దక్కేలా.. యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి తెస్తానంటూ 11వ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అదే విధంగా 25 శాతం ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తుల ఆర్థిక సామాజిక పరిస్థితులపైనా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు.

టీడీపి –జనసేన కూటమి తమ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ప్రకటించిన హామీలతో సమానంగా కాపులకూ  ప్రకటించాల్సిందేనన్నారు. ఇదిలా ఉండగా, మదనపల్లికి.. శ్రీరామ రామాంజనేయులు, తిరుపతి.. ఆరణి శ్రీనివాస్, రాజంపేట.. ఎంవీ రావు, అనంతపురం.. టీసీ వరుణ్, పుట్టపర్తి.. శివశంకర్, తంబళ్లపల్లి కొండా నరేంద్ర, గుంతకల్లు.. మణికంఠకు కేటాయించాలని సూచిస్తూ పవన్‌కు జోగయ్య మరో లేఖ రాశారు.   

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)