Breaking News

‘రిగ్గింగ్‌’ వదిలేసి అడ్డుకుంటే కేసులా?

Published on Thu, 05/23/2024 - 04:27

నరసరావుపేట: ప్రజాస్వామ్య విలువలను కాల­రాస్తూ యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడిన వారిని వదిలేసి అడ్డుకున్న వారిపై ఈసీ కన్నెర్ర చేయడం ఏమిటని గురజాల ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్‌­రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఇష్టాను­సారంగా నోరు పారేసుకుంటున్నారని మండిప­డ్డారు. 

బుధవారం నరసరావుపేటలోని తన నివా­సంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా పిన్నెల్లి నాలుగు సార్లు ప్రజాబలంతో ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తు చేశారు. ఈవీఎం ఘటనను పదే­పదే చూపిస్తున్న టీడీపీ అనుకూల మీడియా అదే­చోట వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లపై జరిగిన దాడులను ఎందుకు దాచి పెడుతోందని నిలదీశారు. 

మిగతా వాటి సంగతేంటి? 
ఒక్క ఈవీఎం ఘటనను చూపిస్తూ పిన్నెల్లి నిందితుడిగా చేర్చారు. మరి పల్నాడులో పలుచోట్ల ఈవీఎంలు ధ్వంసమైతే ఆ వీడియోలను ఎందుకు బయట పెట్టడం లేదు? టీడీపీ నేతలు దౌర్జన్యా­లకు తెగబడి ఈవీఎంలను పగులకొట్టిన వీడియో­లు ఎందుకు బహిర్గతం చేయడం లేదు? పోలింగ్‌ కేంద్రా­ల్లో వీడియో కెమెరాలు అమర్చిన ఈసీ పది రోజులుగా మేం ఘోషిస్తున్నా ఎందుకు స్పందించలేదు?

రిగ్గింగ్‌ జరగలేదని నిరూపించాలి..
మాచర్లలో ఈసీకి ఇప్పటి వరకు ఎన్ని ఫిర్యాదులొచ్చాయి? వాటిపై ఏం చర్యలు తీసుకున్నారో వెల్లడించాలి. పాల్వాయి గేటుతో సహా మేం చెబుతున్న చోట్ల రిగ్గింగ్‌ జరగలేదని వెబ్‌ కెమెరా వీడియోలను బయటపెట్టి నిరూపించగలరా? ప్రజాస్వామ్య వ్యవస్థలో దీన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీదే. 

కొత్త గణేశునిపాడులో మహిళల నిర్బంధం
పోలింగ్‌ రోజు మాచవరం మండలం కొత్త గణేశునిపాడులో అర్ధరాత్రి యాదవులు, ఎస్టీల ఇళ్లపై టీడీపీ మూకలు దాడులకు దిగి స్వైరవిహారం చేశాయి. మహిళలు ప్రాణభయంతో 24 గంటల పాటు ఓ దేవాలయంలో తల దాచుకుంటే ఇరువర్గాలపై కేసులు పెడతారా? ఇదేనా ఈసీ చేసే న్యాయం? పోలింగ్‌కు ముందు పల్నాడులో పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేసిన ఈసీ ఆ స్థానంలో తాను నియమించిన వారు విధుల్లో అలసత్వం ప్రదర్శించారంటూ సస్పెండ్‌ చేసింది. ఈసీ నియమించిన అధికారులే సస్పెండ్‌ అయ్యారంటే ఎవరు విఫలమైనట్లు?
 
రీపోలింగ్‌కు హైకోర్టుకెళ్లి పోరాడతాం..
ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్‌ సీపీ అందించిన ఫిర్యాదులన్నింటికీ సమాధానం చెప్పాల్సిందే. రిగ్గింగ్‌ జరిగినట్లు మేం ఫిర్యాదు చేసిన ప్రతి పోలింగ్‌ కేంద్రం వీడియోలను ఎన్నికల కమిష¯Œన్‌ బహిర్గతం చేయాల్సిందే. అధికారుల నియామకాలు, ఆ తర్వాత వారిని సస్పెండ్‌ చేయడం, ఎన్నికల ప్రక్రియలో లోపాలపై కచ్చితంగా హైకోర్టును ఆశ్రయిస్తాం. రీపోలింగ్‌ నిర్వహించేలా పోరాటం చేస్తాం. 

రిగ్గింగ్‌ ఆరోపణలు వచ్చిన చోట వెబ్‌ కెమెరాలను తనిఖీ చేసి రీపోలింగ్‌ నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉంది. పాల్వాయిగేట్‌ పోలింగ్‌ కేంద్రంలో టీడీపీ నేతలు, ఏజెంట్లు కలసి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లను బయటకు లాగి దాడి చేయడంతో పిన్నెల్లి అక్కడకు చేరుకుని తీవ్రంగా ప్రతిఘటించారు. మేం చెప్పేది నిజం కాకుంటే పూర్తి నిడివి వీడియోలను ఈసీ బయట పెట్టాలి. 

పిన్నెల్లి నాలుగు సార్లు ప్రజాస్వామ్యబద్ధంగా మాచర్ల ఎమ్మెల్యేగా గెలిచారు. ఐదోసారి కూడా కచ్చితంగా విజయం సాధిస్తారు. నలుగురు అధికారులను మేనేజ్‌ చేసి ఎడిటెడ్‌ వీడియోలు లీక్‌ చేసినంత మాత్రాన భయపడే ప్రసక్తే లేదు. ఇలాంటి రాజకీయాలు చాలా చూశాం. 

బాబు నోట నీతులా..?
నరసరావుపేటలో కోడెల ఇంట్లో బాంబులు తయారు చేస్తుండగా నలుగురు చనిపోతే ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పించిన చంద్రబాబు నీతులు చెబుతున్నారు. ఏడుగురి హత్య కేసులో నిందితుడైన మాచర్ల టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డిపై ఏ 1గా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించిన చంద్రబాబు ఇప్పుడు అదే వ్యక్తికి పార్టీ టికెట్‌ ఇచ్చారు. ఫ్యాక్షనిజం, ఫ్యాక్షన్‌  లీడర్లను ప్రోత్సహించేది చంద్రబాబేనని అందరికీ తెలుసు.

'గేట్‌’ వీడియోలన్నీ బయట పెట్టాలి..
మాచర్ల నియోజకవర్గంలోని తుమృకోట, వెల్దుర్తి, చింతపల్లి, వేపకంపల్లె, ఒప్పిచర్లలో టీడీపీ నేతలు యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లను బూత్‌ల నుంచి బయటకు లాక్కెళుతున్న వీడియోలను ఎన్నికల కమిష¯Œన్‌ దృష్టికి తెచ్చాం. పాల్వాయిగేట్‌లో మా పార్టీ ఏజెంట్లను పోలింగ్‌ కేంద్రాల నుంచి బయటకు లాక్కెళ్లి కొడుతుంటే పిన్నెల్లి రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకు వెళ్లారు. 

ఈవీఎం ధ్వంసం ఘటనకు ముందు రెండు మూడు గంటల పాటు సాగిన టీడీపీ మూకల దౌర్జన్యాలు, విధ్వంసకాండను ఎందుకు బయట పెట్టడం లేదు? అక్కడ ఉదయం నుంచి జరిగిన ఘటనల వీడియోలన్నీ బహిర్గతం చేయాలి.

Videos

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)