Breaking News

‘అప్పుడు రూ. 2.49.. ఇప్పుడు రూ. 4.60.. మరి ఇదేంటి బాబూ?’

Published on Mon, 05/05/2025 - 18:33

సాక్షి,విశాఖ: వైఎస్సార్‌సీపీ అధినేత, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై తప్పుడు వార్తలు రాసిన ఎల్లోమీడియా క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ డిమాండ్‌ చేశారు. యాక్సిస్‌తో కుదుర్చుకున్న ఈ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని గుడివాడ అమర్నాథ్‌ కూటమి ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకితో వైఎస్‌ జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే అవినీతి జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేశారు. లక్ష కోట్ల అవినీతి జరిగిందని తప్పుడు వార్తల రాశారు. సెకితో అత్యంత తక్కువ రేటుకు 2.49 రూపాయలకు వైఎస్‌ జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కూటమి ప్రభుత్వం యాక్సిస్ కంపెనీతో యూనిట్‌కు రూ.4.60 రూపాయలకు విద్యుత్ ఒప్పందం చేసుకుంది. రూ.2.49 రూపాయలకు ఒప్పందం చేసుకుంటే అవినీతి జరిగిందన్న మీరు రూ.4.60 ఎలా ఒప్పందం చేసుకున్నారు. రూ.2.11 రూపాయలకు ఎక్కువ కొనుగోలు చేశారు. ఈ ఒప్పందాలపై ఎల్లో మీడియా ఎందుకు వార్తలు రాయడం లేదు. రూ.2.49 అత్యంత తక్కువ ధరకు కొనుగోలు చేసిన వైఎస్ జగన్‌పై రాసిన తప్పుడు వార్తలకు ఎల్లోమీడియా క్షమాపణలు చెప్పాలి.

కూటమి ప్రభుత్వ కొనుగోలు వల్ల రాష్ట్ర ఖజానాకు రూ.11 వేల కోట్ల రూపాయల గండి పడుతుంది. దీనిపై కూటమి పార్టీల నేతలు ఏం సమాధానం చెబుతారు. డబ్బులు ఎలా కొట్టి వేయాలనే దానిమీద ఈ ఏడాది పరిపాలన జరిగింది. యాక్సెస్‌తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి. ప్రభుత్వ అవినీతిని ప్రజల్లో పెడతామని హెచ్చరించారు. 

 ఇదిలా ఉండగా, వ్యవసాయ విద్యుత్‌ అవసరాలకు దాదాపు 30ఏళ్ల పాటు ఢోకా లేకుండా రైతులకు పగటి పూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందించేలా కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో ఏడువేల మెగావాట్ల విద్యుత్‌ ఒప్పందాన్ని కారుచౌకగా నాడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం యూనిట్‌కు రూ.2.49కే అందించేలా ఒప్పందం చేసుకుంది. అయితే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం యాక్సెస్‌ ఎనర్జీ వెంచర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌తో యూనిట్‌కు ఏకంగా రూ.4.60లు కొనుగోలు చేస్తూ ఒప్పందం కుదుర్చుకుంది.

నాడు జగన్‌పై విష ప్రచారాలు.. నేడు అవినీతి ఒప్పందాలు

 

  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)