Breaking News

చంద్రబాబు పొలిటికల్ జాదు : గుడివాడ

Published on Sun, 09/29/2024 - 16:49

సాక్షి,విశాఖపట్నం : సీఎం చంద్రబాబు పొలిటికల్‌ జాదు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టించడంలో చంద్రబాబు ఆరితేరారు’అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ అన్నారు. ఆదివారం  విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  

తిరుపతి ప్రతిష్టను సీఎం చంద్రబాబు దెబ్బ తీశారు. తిరుపతి లడ్డుపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలి. రాష్ట్రానికి కుల రాజకీయాన్ని పరిచయం చేసింది చంద్రబాబు. నేడు కొత్తగా మత రాజకీయానికి పునాదులు చేశారు. మతాలు మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన చంద్రబాబు తిరుపతి లడ్డు అంశాన్ని తెరపైకి తెచ్చారు.

అధికారంలోకి వచ్చిన తరువాత 35 మంది కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నాడు. పెద్ద ఎత్తున ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను ద్వసం చేశారు. కలుషిత ఆహారం తిని చిన్న పిల్లలు చనిపోయారు. విజయవాడ వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణ దిశగా అడుగులు వేస్తుంది. స్టీల్ ప్లాంట్‌లో 4000 మంది కాంట్రాక్ ఉద్యోగులను తీసేసారు. స్టీల్ ప్లాంట్ కోసం కూటమి నేతల రాజీనామాలు అవసరం లేదు. ఎన్డీయే ప్రభుత్వం టీడీపీ బలంతోనే నడుస్తుంది.

స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అపక పోతే మద్దతు ఉపసంహరిస్తామని చెప్పండి. వీటన్నిటినీ నుంచి ప్రజల దృష్టి మార్చడం కోసం తిరుపతి లడ్డు అంశాన్ని తెరపైకి తెచ్చారు. కల్తీ నెయ్యి వాడ లేదని ఈవో చెప్పారు. జూలై నాలుగో తేదీన వచ్చిన ట్యాంకర్లు వెనక్కి పంపమని ఈవో చెప్పారు. చంద్రబాబు తప్పు చేశాడు కాబట్టే సీబీఐ విచారణ జరిపించ లేదు. చంద్రబాబు సీబీఐ విచారణ జరిపించాలని ప్రధానికి లేఖ రాయాలి. 

తిరుపతి మీద మీకు అంత భక్తి ఉంటే తిరుపతి జిల్లాకు ఎక్కువ మద్యం షాపులు కేటాయించారు. తిరుపతి పవిత్రత గురించి మాట్లాడే చంద్రబాబు 264 షాపులు కేటాయించారు. కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయని టీడీపీ గెజిట్ ఈనాడు పేపర్‌లో రాశారు. గతంలో జేబు నిండా డబ్బులు పట్టుకెళ్తే సంచి నిండా కూరగాయలు వచ్చేవి. నేడు సంచి నిండా డబ్బులు పట్టుకెళ్తె జేబు నిండా కూరగాయలు వస్తున్నాయి.

చంద్రబాబు ఒక పొలిటికల్ జాదు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టించడంలో చంద్రబాబు ఆరితేరాడు. అపవిత్రమైన టీడీపీ ప్రభుత్వం కోసం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు వేసిన సిట్ మీద మాకు నమ్మకం లేదు అని గుడివాడ అమర్నాథ్‌ అన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)