Breaking News

ఉత్తరాంధ్ర అభివృద్ధి పవన్‌కు ఇష్టంలేదు 

Published on Thu, 08/17/2023 - 02:27

సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందడం పవన్‌ కల్యాణ్‌కు ఏమాత్రం ఇష్టంలేదని ఆయన మాటలనుబట్టి అర్థమవుతోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ధ్వజమెత్తారు. ఎర్రమట్టి దిబ్బలపై పవన్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. ఎర్రమట్టి దిబ్బలు ఆక్రమిస్తున్నారంటూ పవన్‌ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. అభివృద్ధి చేస్తున్న ప్రాంతానికి, ఎర్రమట్టి దిబ్బలకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

కొత్తవలసలో వీఎంఆర్‌డీఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని, ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ నిర్మాణాలు చేపట్టడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో భూ కుంభకోణాలు బయట పెడతానంటూ నాలుగైదు రోజులుగా ఈ ప్రాంతంలో పర్యటిస్తున్న పవన్‌ వాటిని నిరూపించలేక బొక్క బోర్లా పడ్డారని వ్యాఖ్యానించారు. “మీ డాడీ ఇచ్చిన స్క్రిప్ట్‌ చదవకుండా, వాస్తవాలు తెలుసుకొని, అవగాహన పెంచుకుని ఇక్కడికి వచ్చి ఉంటే బాగుండేది.్ఙ అని హితవు పలికారు.

చంద్రబాబు హయాంలో ఈ ప్రాంతంలో వేలాది ఎకరాలు కబ్జాకు గురైతే పెదవి విప్పని పవన్‌ ఇప్పుడు ఎందుకు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఆయన పర్యటించిన ప్రాంతంలో ఎక్కడా లోపాలు దొరక్కపోవడంతో నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌కీ, మోదీకి చెప్తానంటూ ప్రగల్బాలు పలుకుతున్నారని వ్యాఖ్యానించారు. పవన్‌ ఇక్కడ ఉండే ఒకట్రెండు రోజుల్లోనైనా ప్రజలకు ఏం చేస్తారో చెప్పుకోవాలని,  అవాస్తవాలను మాత్రం మాట్లాడొద్దని సూచించారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)