Breaking News

గుడివాడ కూటమిలో భగ్గుమన్న విభేదాలు.. అర్ధరాత్రి ఉద్రిక్తత

Published on Mon, 08/19/2024 - 09:06

కృష్ణా, సాక్షి: గుడివాడ కూటమి రాజకీయాల్లో విబేధాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.  జెండా దిమ్మపై దాడి ఘటనతో గత అర్ధరాత్రి నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల జోక్యంతో టీడీపీ - జనసేన కార్యకర్తల బాహాబాహీ కాస్తలో తప్పింది.

నాగవరప్పాడు జంక్షన్‌లో జనసేన జెండా దిమ్మను ధ్వంసం చేసేందుకు టీడీపీ నేత ధారా నరసింహారావు ప్రయత్నించారు. దీంతో జనసేన కార్యకర్తలు ఆయన్ని అడ్డుకున్నారు. టీడీపీ నేతలు కూటమి ధర్మం పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. జాతీయ రహదారి పై ఆందోళనకు దిగారు.  గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తక్షణమే స్పందించాలని నినాదాలు చేశారు. 

ఈ క్రమంలో.. టీడీపీ వాళ్లు కూడా అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వాగ్వాదం కాస్త గొడవగా మారే అవకాశం ఉండడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. జనసేన కార్యకర్తలకు నచ్చజెప్పి పంపించి వేశారు. అయితే.. జనసేన జెండా దిమ్మ పై దాడిని తమ పై దాడిగా భావిస్తామంటున్న జనసేన కార్యకర్తలు, ఈ విషయాన్ని పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్తామంటున్నారు. అలాగే.. 

టీడీపీ నుంచి నరసింహారావును బహిష్కరించాలని, లేని పక్షంలో తమ ఆందోళనను ఉధృతం చేస్తామని టీడీపీ ఎమ్మెల్యే రాముకు జనసేన నాయకులు హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు.. టీడీపీ నేత ధారా నరసింహారావు పై పోలీసులకు ఫిర్యాదు చేశారు జనసేన కార్యకర్తలు.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)