Breaking News

మధుసూదన్‌ అరెస్ట్‌తో రంగంలోకి హరీష్‌.. ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

Published on Fri, 03/15/2024 - 11:16

సాక్షి, సంగారెడ్డి: పటాన్‌చెరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి తమ్ముడు మధుసూదన్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మధుసూదన్‌ను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడికి బీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీగా చేరుకోవడం ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

ఇక, మధుసూదన్‌ అరెస్ట్‌ నేపథ్యంలో ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి, మాజీ మంత్రి హరీష్‌రావు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మహిపాల్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘దేశం మొత్తంలో ఎన్నో క్వారీలు ఉన్నాయి. పూర్తి పర్మిషన్‌తో క్వారీలు నడిపిస్తున్నాము. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదు. ప్రజా కోర్టులో తేల్చుకుంటాం. కింది స్థాయి నుంచి ప్రజల మద్దతుతో రాజకీయాల్లో కొనసాగుతున్నాము. మా తమ్ముడిని అక్రమంగా అరెస్ట్‌ చేశారు’ అని వ్యాఖ్యలు చేశారు. 

మాజీ మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ..‘తెలంగాణలో కాంగ్రెస్‌ వంద రోజలు పాలన ఎలా తయారైందంటే కాంగ్రెస్‌ పార్టీలో చేరాలి లేదంటే అక్రమ కేసులు నమోదు చేస్తారు. అక్రమ కేసులతో వేధిస్తున్నారు.  వందల మంది పోలీసులతో కలిసి తెల్లవారుజామున మూడు గంటలకు వెళ్లి అరెస్ట్‌ చేయడం ఎంత వరకు సమంజసం. అంత అవసరం ఏముంది?. నోటీసులు ఇవ్వరు.. ఎఫ్‌ఐఆర్‌ కాపీ ఇవ్వలేదు. అధికారం శాశ్వతం కాదు. గత పదేళ్లలో మేము ఎప్పుడూ కక్షపూరితంగా వ్యవహరించలేదు. ప్రభుత్వం ఇలాంటి విధానాలను మార్చుకోవాలి. 

Video Credit: TeluguScibe

మంత్రి దామోదర  రాజనర్సింహ ఆదేశాలతో మధుసూదన్‌ను టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల క్వారీలు మీద ఎటువంటి చర్యలు లేవు. వరుసగా కేసులు నమోదు చేస్తూ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు. వంద రోజులు పూర్తి అయ్యాయి.. హామీల అమలు పూర్తి కాలేదు. సోషల్ మీడియా ద్వారా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. చివరకు ధర్మమే గెలుస్తుంది. కోర్టుల ద్వారా అంతిమంగా న్యాయమే గెలుస్తుంది. మీ కుట్రలను ప్రజల ముందుకు తీసుకొని వెళ్తాము. మెడ మీద కత్తి పెట్టి జాయిన్ చేసుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది పనికి రాదు. కాంగ్రెస్  ప్రభుత్వం ప్రజల మనసు గెలవండి. ప్రతి పక్షం లేకుండా చేయాలి అనుకోవడం కరెక్ట్‌ కాదు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)