Breaking News

ఇదీ చంద్రబాబు గంజాయి నీతి..

Published on Sat, 04/08/2023 - 08:00

సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ ఓ గంజాయి మొక్కని.. ద్వంద్వ నీతికి తాను నిలువెత్తు నిదర్శనమని చంద్రబాబు మరోసారి నిరూపించారు. గంజాయి స్మగ్లర్లకు టీడీపీ అండగా ఉంటుందని కూడా చేతల్లో చూపించారు. ఇందుకు సంబంధించిన ఓ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న.. పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన నరసరావుపేటకు చెందిన మానుకొండ జాహ్నవికి పార్టీలోకి తిరిగి ఎర్రతివాచి పరిచారు. తద్వారా గంజాయి స్మగ్లర్లకు టీడీపీ అడ్డా అని నిరూపించారు. 

చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో నర్సీపట్నం కేంద్రంగా అప్పటి మంత్రి అయ్యన్నపాత్రుడు అనుచర వర్గమే రాష్ట్రంలో గంజాయి స్మగ్లింగ్‌ను యథేచ్ఛగా నిర్వహించింది. అధికారం కోల్పోగానే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ఈ విషయంలో దుష్ప్రచారం చేసేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు.. చంద్రబాబు తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఎందుకంటే.. 2013లో గంజాయి స్మగ్లింగ్‌ ముఠాపై అప్పటి హైదరాబాద్‌ పోలీసులు దాడిచేసి కేసు నమోదు చేశారు. ఆ కేసులో నిందితురాలిగా ఉన్న జాహ్నవిని తెలంగాణ పోలీసులు 2022 మేలో అరెస్టుచేశారు. దాంతో టీడీపీ బండారం బట్టబయలైంది. ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు చంద్రబాబు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు. తుదితీర్పు వచ్చేవరకు ఈ సస్పెన్షన్‌ అమలు­లో ఉంటుందని కూడా చెప్పారు. 

కానీ, జాహ్నవి మాత్రం టీడీపీలో క్రియాశీలంగానే కొనసాగుతోంది. అలాగే, ఆమెపై ఉన్న సస్పెన్షన్‌ను తొలగించాలని చంద్రబాబు తాజాగా నిర్ణయించారు. దీంతో జాహ్నవిపై ఉన్న సస్పెన్షన్‌ను తొలగిస్తున్నట్లు టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. కానీ, ఆమెపై ఉన్న స్మగ్లింగ్‌ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ పార్టీలో ఆమెపై సస్పెన్షన్‌ను తొలగించి టీడీపీలోకి ఆమెను తిరిగి ఆహ్వానించడం ద్వారా చంద్రబాబు తన నైజాన్ని మరోసారి చాటుకున్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)