Breaking News

డీజిల్‌ మొదలుకొని సభల వరకూ.. ప్రజల సొమ్ముతోనే ప్రచారం!

Published on Mon, 04/15/2024 - 11:52

దేశంలో లోక్‌సభ ఎన్నికల సందడి నెలకొంది. పలు పార్టీలకు చెందిన నేతలు తమ ప్రచారాలను ముమ్మరం చేశారు. ఈ నేపధ్యంలో పలు వింత దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. గుజరాత్‌లోని బనస్కాంత లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరపున బరిలోకి దిగిన గనీబెన్ ఠాకూర్‌ ప్రచారతీరును చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే! 

ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకువెళుతున్న గనీ బెన్‌ అందుకు అయ్యే ఖర్చును అక్కడి జనం నుంచి వసూలు  చేస్తున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ తన ఎన్నికల ఖర్చుల కోసం చాలామంది  విరాళాలు  ఇచ్చారని తెలిపారు.  అందుకు ప్రతిగా బనస్కాంత ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. గత  10 రోజుల్లో తాను నిర్వహించిన బహిరంగ సభల ఏర్పాటుకు అయ్యే ఖర్చులను పలువురు భరించారని తెలిపారు. తన కారు డీజిల్ ఖర్చును కూడా జనమే చూసుకుంటున్నారని తెలిపారు. ప్రజల నుండి ఆర్థిక సహాయం కోరేందుకు కాంగ్రెస్ ‘దేశం కోసం విరాళం’ ప్రచారాన్ని ప్రారంభించిందని ఆమె తెలిపారు. 

బనస్కాంతలో కాంగ్రెస్‌ అభ్యర్థి గనీ బెన్‌పై బీజేపీ నుంచి ప్రొఫెసర్ రేఖా చౌదరి  ఎన్నికల బరిలోకి దిగారు. రేఖా చౌదరి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గుజరాత్‌లోని మొత్తం 26 లోక్‌సభ స్థానాలకు మే 7న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. కాగా 2013లో జరిగిన ఉప ఎన్నికతో సహా గత మూడు లోక్‌సభ ఎన్నికల్లో బనస్కాంత సీటును బీజేపీ గెలుచుకుంది.

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)