Breaking News

పవన్ పరామర్శ కోసం పడిగాపులు

Published on Fri, 01/10/2025 - 11:57

కాకినాడ, సాక్షి: ఎవరైనా బాధితులను ఎలా పరామర్శిస్తారు?. స్వయంగా వెళ్లి పరామర్శించే వాళ్లు కొందరైతే..  బాధితుల్నే తమ దగ్గరకు రప్పించుకునేవాళ్లు మరికొందరు. అందుకు రకరకాల కారణాలు ఉండొచ్చు. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మాత్రం మూడో రకం!. సమయం-సందర్భం ఈ రెండింటితో సంబంధం లేకుండా బాధితులను తన దగ్గరికి రప్పించుకుని మరీ వాళ్లను వెయిట్‌ చేయిస్తారు. ​

‘గేమ్‌ ఛేంజర్‌’ మూవీ ఈవెంట్‌కు వెళ్లి మెగా అభిమానులిద్దరూ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత సంగతి తెలిసిందే. సినిమా పిచ్చి.. అంతకు మంచి హీరోలంటే వెర్రి అభిమానం తమవాళ్ల ప్రాణాలు తీసిందని ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. అయితే ఈ ప్రమాదం తర్వాత అటు చిత్ర యూనిట్‌గానీ, ఇటు ఆ ఈవెంట్‌కు చీఫ్‌గెస్ట్‌గా హాజరైన పవన్‌ కల్యాణ్‌గానీ బాధిత కుటుంబాల్ని పరామర్శించి ఓదార్చలేదు. సరికదా.. గత ప్రభుత్వం రోడ్డు సరిగ్గా వేయలేదని, అందుకే రెండు నిండుప్రాణాలు బలయ్యాయంటూ రాజకీయం చేయబోయారు. ఆపై కంటితుడుపు చర్యగా.. తన జనసేన తరఫున రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. అయితే.. 

పవన్‌ నియోజకవర్గం పిఠాపురం నుంచి బాధిత కుటుంబాలు ఉండేది పది కిలోమీటర్ల దూరంలోనే. ఘటన జరిగి వారం అవుతున్నా బాధితులను పవన్‌గానీ, జనసేన తరఫు నేతలుగానీ కలిసింది లేదు. పోనీ.. ఇప్పుడు వాళ్లను రప్పించుకున్న సందర్భమైనా బాగుందా? అంటే అదీ లేదు. పిల్లలను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాలను ఇప్పుడు తన కోసం పడిగాపులు పడేలా చేశారాయన. 

పిఠాపురం సంక్రాంతి వేడుకల్లో వాళ్లను పవన్‌ పరామర్శించడం చర్చనీయాంశమైంది. ఓవైపు సంబరాలు జరుగుతుంటే.. మరోవైపు ఆ వేదిక వద్ద కింద వాళ్లు కూర్చున్నారు. ఉదయం నుంచి వాళ్లు ఆయన కోసం ఎదురు చూస్తూ కనిపించారు. ఈ ఘటనలో ఎక్కడో మానవత్వం లోపించలేదంటారా?. ఆయన అభిమానులైనా.. ఇదేం పరామర్శ అని అనుకోరంటారా?!.

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు