Breaking News

కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉన్నారు

Published on Fri, 08/02/2024 - 05:18

గద్వాల రూరల్‌: ‘అసెంబ్లీలో పాతమిత్రులు కనిపిస్తే వెళ్లి మాట్లాడినంత మాత్రాన పార్టీ మారినట్లు మీడియా కథనాలు రాయడం సరైంది కాదు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతున్నారు’అని ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఆయన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డితో కలసి గద్వాలలోని ఎమ్మెల్యే బండ్ల నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్‌రెడ్డితో మంతనాలు చేయడంతో పాటు ఆయనతో కలసి అల్పాహారం చేశారు.

అనంతరం మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, గద్వాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చారన్నారు. పార్టీలో ఆయనకు తగిన ప్రాధాన్యం ఉంటుందని, ఎక్కడా ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నెట్టెంపాడు, ర్యాలంపాడు ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు లేకపోవడంతో కొంత మనస్తాపానికి గురైనట్లున్నారని పేర్కొ న్నారు.

కాగా, కాంగ్రెస్‌ పార్టీలో అందరికీ సమాన అవకాశాలుంటాయని, పార్టీలో ఎలాంటి వర్గపోరు లేదని చెప్పారు. గద్వాల అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డికే ప్రథమ ప్రాధాన్యం కల్పిస్తామని తెలిపారు. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పార్టీ మారారనే ప్రచారం కేవలం అపోహ మాత్రమేనన్నారు. అనంతరం ఆయన కృష్ణమోహన్‌రెడ్డిని తన వాహనంలో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)