Breaking News

కర్ణాటకలో మద్యం పంపిణీ వివాదం: ‘ఇది బీజేపీ కల్చర్‌’

Published on Mon, 07/08/2024 - 16:49

బెంగళూరు: కర్ణాటక బీజేపీ ఎంపీ కే సుధాకర్‌ మద్దతుదారులు ఆయన ఎన్నికల్లో గెలిచినందుకు విజయోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసుల చేత బహిరంగంగా మద్యం పంపిణీ చేయించటం తాజాగా వివాదాస్పదం అయింది. దీంతో ఎంపీ సుధాకర్‌పై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. దీనిపై కర్ణాటక​ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ స్పందించారు.

‘‘బీజేపీ ఎంపీ విజయోత్సవ కార్యక్రమంలో బహిరంగంగా మద్యం పంపిణీ చేయటంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టత ఇవ్వాలి. అయితే ఈ వ్యవహారంలో స్థానిక నేతలు సమాధానం ఇవ్వటం కాదు.. జాతీయ అధ్యకక్షుడే  స్పష్టత  ఇవ్వాలి. ఇది బీజేపీ బీజేపీ కల్చర్‌’’ అని  అన్నారు. అదేవిధంగా రాష్ట్ర ఎక్సైజ్ పాలసీ కింద ప్రభుత్వం ఈవ్యవహారంలో ఏమైనా చర్యలు తీసుకుంటుందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు.. చర్యలు తీసుకోవటం అనేది తర్వాత అంశం. ముందు బీజేపీ పార్టీ ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాలని అన్నారు.

చిక్కబళ్లాపూర్‌లో నిర్వహించిన బీజేపీ ఎంపీ సుధాకర్ విజయోత్సవ కార్యక్రమంలో పోలీసు మద్యం పంచిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఈ కార్యక్రమం గురించి సదరు ఎంపీ పోలీసులకు మందుగానే లేఖ రాసినట్లు తెలుస్తోంది.  ఈ కార్యక్రమంలో ఆహారం, మద్యం పంచటంలో సాయం అందించాలని ఆయన ఆ లేఖలో పేర్కొనటం గమనార్హం. అయితే ఇలాంటి కార్యక్రమానికి పోలీసులు ఎలా అనుమతి ఇచ్చారు. అదీకాక పోలీసులే మద్యం పంచటంపై  తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

మద్యం పంపిణీ వ్యవహారం వివాదం రేపటంతో మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే సీఎన్‌ అశ్వనాథ్‌ నారాయణ్‌  స్పందించారు.  ‘ఈ విషయాన్ని పూర్తిగా పరిశీలించకముందే మేము ఎవరీని నిందించలే​ము. ఇటువంటి వ్యవస్థ ఉన్నందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఈ కార్యక్రమంలో తప్పు జరిగిందని భావిస్తే.. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు.   

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో చిక్కబళ్లాపూర్‌ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున సుధాకర్ గెలుపొందారు. సుమారు 1.6 లక్షల మెజార్టీతో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంఎస్ రక్షా రామయ్య ఓడించారు. 

Videos

నా చావుకు కారణం ఆ ముగ్గురే.! మాధురి రాథోడ్ లేఖ వైరల్..

కుప్పకూలిన భారీ భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?

ఎవడికీ భయపడాల్సిన పని లేదు... చంద్రబాబుకు రోజా స్ట్రాంగ్ వార్నింగ్

హే మిస్టర్.. దమ్ముంటే CBI ఎంక్వైరీ వేయ్..

ఒక్కడే ఒక సైన్యంలా.. కలుషిత నదికి ప్రాణం పోస్తున్న యువకుడు..!

నేను జగన్ చెంచాను అయితే.. నువ్వు చంద్రబాబు కు చెంచావా..?

హెరిటేజ్ లో పాలు అమ్మినట్టు.. టీచర్ పోస్టులను అమ్మేశారు

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం!

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

Photos

+5

తెలగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)

+5

నిర్మాతల మండలి ఎన్నికలు..ఓటేసిన టాలీవుడ్‌ సెలెబ్రెటీలు (ఫోటోలు)

+5

ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 06 -సెప్టెంబర్ 12)

+5

'అంతా రాములోరు చూసుకుంటారు' మూవీ టైటిల్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)