Breaking News

‘ఉచితాలు అమెరికా దాకా వెళ్లాయి’.. ట్రంప్‌ పోస్టుపై కేజ్రీవాల్‌

Published on Fri, 10/11/2024 - 17:49

న్యూఢిల్లీ: ఉచిత పథకాల ప్రకటన అమెరికా వరకు వెళ్లాయంటూ ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రావాల్‌ పేర్కొన్నారు. ఈమేరకు రిపబ్లికన్‌ పార్టీ తరపున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ట్రంప్‌ చేసిన పోస్టును కేజ్రావాల్‌ రీట్వీట్‌ చేశారు. ‘అధ్యక్షుడిగా ఎన్నికైతే కరెంట్‌​ బిల్లులు సగానికి తగ్గిస్తానని ట్రంప్‌ ప్రకటించారు. ఉచిత తాయిలాలు అమెరికా దాకా వెళ్లా’ అని తెలిపారు.

కాగా దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్‌ ప్రభుత్వం.. ప్రజలకు ఉచిత కరెంటు పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిని బీజేపీ వ్యతిరేకిస్తుంది. ఉచితాల పేరుతో ఆప్‌ ప్రజలను మోసం చేస్తోందని మండిపడుతోంది. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కేజ్రీవాల్ ఉచితాలు ప్రకటిస్తున్నారని విమర్శిస్తోంది. అయితే, పేదల సంక్షేమం కోసమే తాను వాటిని అమలు చేస్తున్నానంటూ కేజ్రీవాల్‌ సమర్థించుకోవడమూ తెలిసిందే.

తాజాగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే విద్యుత్ ఛార్జీలు సగానికి తగ్గిస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు.‘అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత 12 నెలల్లో ఇంధన, కరెంట్‌ బిల్లులు సగానికి తగ్గిస్తా. మన విద్యుత్ సామర్థ్యాన్ని రెట్టింపు చేసేలా చర్యలు తీసుకుంటాం. దీంతో ద్రవ్యోల్బణం తగ్గుతుంది. ఈ చర్యల వల్ల అమెరికా మరీ ముఖ్యంగా మిచిగాన్‌లో వ్యాపార అవకాశాలు పెరుగుతాయి’ అని ఎక్స్‌ వేదికగా వెల్లడించారు

అంతేగాక ఇటీవల అరవింద్ కేజ్రీవాల్‌ మాట్లాడుతూ..ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లోగా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉచిత కరెంటిస్తే బీజేపీ తరపున ఢిల్లీ ఎన్నికల్లో తాను ప్రచారం చేస్తానని ప్రధాని మోదీకివాల్‌ విసిరారు. నవంబర్‌లో జార్ఖండ్‌, మహారాష్ట్రతో పాటు ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని, ఇందుకు ఆప్‌ సిద్ధంగా ఉందన్నారు. డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాలంటే రెట్టింపు అవినీతి, రెట్టింపు దోపిడి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగమని విమర్శించారు. పొరపాటున బీజేపీకి ఓటేస్తే తమ సర్కారు ఉచితంగా అందిస్తున్న విద్యుత్తు, నీళ్లు, మహిళలకు బస్సు ప్రయాణం, వృద్ధులకు తీర్థయాత్రలు, ఆరోగ్యం, విద్య అదృశ్యమైపోతాయని అన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)