Breaking News

TS: స్పీడ్‌ పెంచిన కాంగ్రెస్‌.. థాక్రే, రేవంత్‌తో వారిద్దరూ భేటీ

Published on Sat, 06/17/2023 - 15:35

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ స్పీడ్‌ పెంచింది. ఈ క్రమంలోనే పార్టీలో చేరికలపై కాంగ్రెస్‌ దృష్టిపెట్టింది. కాగా, తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావు థాక్రే, రేవంత్‌ రెడ్డిలతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దామెదర్‌రెడ్డి భేటీ అయ్యారు. దీంతో, దామోదర్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరికపై చర్చ జరగుతోంది. ఇదిలా ఉండగా.. దామోదర్‌ రెడ్డితో పాటుగా నాగం జనార్ధన్‌ రెడ్డి కూడా భేటీ అయ్యారు. 

ఇదిలా ఉండగా.. ఖమ్మం జిల్లా కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారు అయినట్టు తెలుస్తోంది. ఈ నెల 22వ తేదీన ఆయన కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం. ఈ మేరకు శనివారం ఆయన కాంగ్రెస్‌ కీలక నేత రాహుల్‌ గాంధీతో జూమ్‌ మీటింగ్‌లో మాట్లాడినట్లు పార్టీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. రాహుల్‌ గాంధీతో జూమ్‌ మీటింగ్‌లోనే పొంగులేటి చేరిక తేదీ ఫిక్స్‌ అయ్యింది. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సైతం పాల్గొన్నట్లు తెలుస్తోంది. 

ఇక అదే తేదీన పొంగులేటితో పాటు జూపల్లి కృష్ణారావు, సైతం కాంగ్రెస్‌లో చేరనున్నట్టు సమాచారం. మరోవైపు.. విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్‌ గాంధీ ఈ నెల 21వ తేదీన ఢిల్లీకి చేరుకుంటారు. అదే తేదీన టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సైతం ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక జూపల్లి, పొంగులేటి చేరిక తర్వాత ఖమ్మం, పాలమూరుల్లో కాంగ్రెస్‌ పార్టీ భారీగా బహిరంగ సభ నిర్వహించే యోచనలో ఉంది.

ఇది కూడా చదవండి: ప్రొ.హరగోపాల్‌పై కేసు ఎత్తేయండి: డీజీపీకి సీఎం కేసీఆర్‌ ఆదేశం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)