Breaking News

కారు దిగిన రంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్‌

Published on Mon, 02/26/2024 - 03:35

మీర్‌పేట, సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పా రు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. సోమవారం గాంధీ భవ న్‌లో కాంగ్రెస్‌ వ్యవహా రాల రాష్ట్ర ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్టు అనితారెడ్డి, తీగల కృష్ణారెడ్డి ప్రకటించారు. మీర్‌పేటలోని టీకేఆర్‌ కళాశాలలో ఆదివారం మీడియాతో జెడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి మాట్లాడారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయడంలో బీఆర్‌ఎస్‌ పూర్తిగా విఫలమైందనీ, ఫలితంగానే ఇటీవల ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలైందన్నారు.

స్థానిక సంస్థల పరిస్థితిని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా నిధులు సమకూర్చడంతో పాటు అధికారాలు ఇస్తామని హామీ ఇచ్చారని ఆమె తెలిపారు.సహకరించినా ప్రాధాన్యత ఇవ్వలేదు: మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. నగర మేయర్‌గా, ఎమ్మెల్యేగా, హుడా చైర్మన్‌గా దశాబ్దాల పా టు సేవ చేశానన్నారు. తన ఓటమి తరువాత కాంగ్రెస్‌లో గెలిచిన వారికి బీఆర్‌ ఎస్‌లో మంత్రి పదవి ఇచ్చారని, అయినా పార్టీకి సహకరించినా ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, తాను గతంలో కలిసి పనిచేశామని.. ఆయన పిలుపు మేరకే కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్టు తెలిపారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)