Breaking News

రైతు పక్షపాత ప్రభుత్వంపై దుష్ప్రచారమా? 

Published on Fri, 05/12/2023 - 05:22

కాకినాడ: వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వమని, అన్నదాత సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఈ సర్కారుపై మాజీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ దుష్ప్రచారం చేస్తారా... అంటూ వ్యవసాయ శాఖ మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. ఆయన గురువారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవలి అకాల వర్షాలను సాకుగా తీసుకుని రైతుల పక్షాన మాట్లాడుతున్నట్టు ఆ ఇద్దరు నేతలు డ్రామాలు ఆడుతున్నారని అన్నారు.

ఏ ఒక్క రైతు నష్టపోకూడదనే లక్ష్యంతో సీఎం వైఎస్‌ జగన్‌ నిబంధనలను సడలించి మరీ తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా సివిల్‌ సప్లైస్‌ ద్వారా ఖరీఫ్‌లో 6.40 లక్షల రైతుల నుంచి 35,41,564 టన్నుల ధాన్యం కొన్నారని తెలిపారు. సుమారు రూ.7,233 కోట్లలో రూ.7,212 కోట్లు.. అంటే 99 శాతం చెల్లింపులు జరిగాయని చెప్పారు. ప్రస్తుత సీజన్‌లో రూ.1,629 కోట్ల విలువైన ధాన్యాన్ని కొని రూ.1,277 కోట్ల చెల్లింపులు కూడా చేశారన్నారు.

21 రోజుల్లో చెల్లించాలనే నిబంధన ఉన్నప్పటికీ రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆరు రోజులకే చెల్లించారన్నారు. ఎఫ్‌సీఐ బొండాలు ధాన్యాన్ని కొంతకాలంగా కొనడంలేదని, అయితే ఈసారి అధిక విస్తీర్ణంలో ఈ రకం పండించడంతో ముఖ్యమంత్రి కేంద్రం దృష్టికి తీసుకెళ్లి వాటినీ కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. 17 శాతంకన్నా తేమ అధికంగా ఉంటే రైతులు నష్టపోకూడదని నిబంధనలు సడలించారన్నారు. తడిసిన ధాన్యం కళ్లాల్లో ఉండడం వల్ల ఆఫ్‌లైన్‌లో సైతం ప్రొక్యూర్‌మెంట్‌ జరిగిందన్నారు. ఇవన్నీ విపక్ష నేతలకు కనిపించలేదా.. అని ప్రశ్నించారు.

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)