Breaking News

‘చంద్రబాబు.. మీరు ఏనాడైనా ప్రాజెక్టుల గురించి పట్టించుకున్నారా?’

Published on Tue, 12/31/2024 - 17:53

తాడేపల్లి : తన హయాంలో  ఏనాడు ప్రాజెక్టుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)..  ఇప్పుడు కొత్తగా గోదావరి-బనకచర్లని కూడా తనదే అంటూ ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu).

ఈరోజు(మంగళవారం) తాడేపల్లి నుంచి మీడియాతో మాట్లాడిన అంబటి.. నదుల్లో ప్రవహించే ప్రతి నీటిబొట్టు భూమి మీదుకు రావాలని దివంగత మహానేత వైఎస్సార్‌ ఆశించారని, అందుకే పెద్ద ఎత్తున జలయజ్ఝాన్ని(Jalayagnam) ప్రారంభించారన్నారు. అటువంటింది ఇప్పుడు కొత్తగా గోదావరి-బనకచర్లని కూడా తనదే అంటూ చంద్రబాబు ప్రచారం  చేసుకుంటున్నారన్నారు. 

ఈ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. ఈ ప్రాజెక్టును మూడు దశల్లో పూర్తి చేయాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) ప్లాన్‌ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా అంబటి గుర్తు చేశారు. కృష్ణా నదిలో నీరు సరిపడా రాకపోయినా గోదావరి నీటితో పల్నాడు, రాయలసీమకి ఉపయోగపడుతుందని జగన్ ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. దీనికి డీపిఅర్ కూడా జగన్ ప్రభుత్వమే తయారు చేసి కేంద్రానికి పంపిందన్నారు. కానీ చంద్రబాబు తానే చేసినట్టుగా ఏమాత్రం సిగ్గు పడకుండా చెప్పుకుంటున్నారని, చివరికి ఈ ప్రాజెక్టును కూడా ప్రయివేటు పరం చేయబోతున్నారని విమర్శించారు అంబటి.

చివరికి సాగునీటి ప్రాజెక్టులను కూడా ప్రయివేటు పరం చేయటాన్ని ఇప్పుడే చూస్తున్నామన్నారు. ఇది జల హారతి కాదని, చంద్రబాబు హారతి అని అంబటి ఎద్దేవా చేశారు.  చంద్రబాబు ఇప్పటికే పోర్టులు మెడికల్ కాలేజీలు, రోడ్లను ప్రయివేటు పరం చేశారన్నారు.

 

రౌడీయిజం అంతా చంద్రబాబు మనుషులే చేస్తున్నారు
రాష్ట్రంలో రౌడీయిజం అంతా చంద్రబాబు మనుషులే చేస్తున్నారన్నారు. కొందరు పోలీసులు కూడా రౌడీయిజం చేస్తున్నారన్నారని అంబటి మండిపడ్డారు. ఈ ప్రభుత్వం ఎంతోకాలం నిలవదనే గుర్తు పెట్టుకోవాలన్నారు. చంద్రబాబు ధనిక ముఖ్యమంత్రి అని, రెండు ఎకరాల నుండి వేల కోట్లు ఎలా సంపాదించాడని ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ప్రజా ఉద్యమాలు త్వరలో రావడం తథ్యమన్నారు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)