Breaking News

పొత్తు చిచ్చు.. కాంగ్రెస్‌ను వీడిన బిహార్‌ మాజీ చీఫ్‌

Published on Mon, 04/01/2024 - 09:39

పాట్నా: లోక్‌సభ ఎన్నికలకు ముందు బిహార్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆర్‌జేడీతో పొత్తును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అనిల్ శర్మ పార్టీని వీడారు. ఆర్‌జేడీతో వినాశకరమైన పొత్తులో కాంగ్రెస్‌ పార్టీ ఇరుక్కుపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. 

ఇక్కడ విలేకరుల సమావేశంలో అనిల్‌ శర్మ కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నట్లు ప్రకటన చేశారు. వివాదాస్పద మాజీ ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్‌ను ఇటీవల ఆర్భాటంగా పార్టీలోకి చేర్చుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. “ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్‌ పార్టీలో దురదృష్టవశాత్తూ ప్రజాస్వామ్యం కనిపించదు.  పార్టీ జాతీయ అధ్యక్షుడు కూడా రాహుల్ గాంధీ లేదా అతని సన్నిహితుడు కేసీ వేణుగోపాల్‌ను సంప్రదించకుండా ఎటువంటి నిర్ణయం తీసుకోలేరు” అని శర్మ ఆరోపించారు.

దాదాపు దశాబ్ద కాలంలో పార్టీని వీడిన నాల్గవ మాజీ బిహార్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శర్మ నిలిచారు. 2018లో అశోక్ చౌదరి పార్టీని వీడి జేడీయూలో చేరారు. అంతకుముందు, 2015లో రామ్ జతన్ సిన్హా కాంగ్రెస్‌ను విడిచిపెట్టారు. అంతకు ముందు సంవత్సరం, మెహబూబ్ అలీ కైజర్ ఎల్‌జేపీలో చేరారు.

"నేను 1985లో కాంగ్రెస్‌లో చేరాను. దాదాపు నాలుగు దశాబ్దాలలో రెండుసార్లు సంస్థాగత పదవులను నిర్వహించాను. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశాను. నేనెప్పుడూ టిక్కెట్ కోసం గానీ, శాసన మండలి బెర్త్ కోసం గానీ లాబీయింగ్ చేయలేదు. అలాగే కాంగ్రెస్‌ను వీడే ముందు మరే ఇతర పార్టీలో అవకాశాలను అన్వేషించలేదు" అని అనిల్‌ శర్మ చెప్పుకొచ్చారు.

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)