ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం
Breaking News
AP:టీడీపీకి మాజీ మంత్రి గొల్లపల్లి గుడ్ బై
Published on Wed, 02/28/2024 - 11:55
సాక్షి,తూర్పుగోదావరి: టీడీపీకి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు రాజీనామా చేశారు. తన ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దెబ్బతీసినందునే రాజీనమా చేస్తున్నట్లు గొల్లపల్లి తెలిపారు. ఈ మేరకు బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు.
కష్టకాలంలో పార్టీ కోసం పనిచేశానని లేఖలో గొల్లపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. రాజోలులో సీటు ఇవ్వకుండా అవమానించారని తెలిపారు. ఇటీవల టీడీపీ, జనసేన ప్రకటించిన ఉమ్మడి ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబితాలో గొల్లపల్లి పేరు లేకపోవడంతో ఆయన కలత చెందారు. పొత్తులో భాగంగా రాజోలు సీటును జనసేనకు టీడీపీ కేటాయించింది.
దీంతో ఇక టికెట్ రాదని గొల్లపల్లి పార్టీని వీడినట్లు తెలుస్తోంది. కాగా, భవిష్యత్ కార్యాచరణపై ఆయన త్వరలో నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది. గొల్లపల్లి త్వరలో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇదీ చదవండి.. టీడీపీ జనసేన మధ్య తారాస్థాయికి సీటు హీట్
Tags : 1
