Breaking News

అందరూ రెడ్డిలే.. టికెట్‌ నాకే అంటూ ప్రచారం.. అదృష్టం ఎవరికో?

Published on Fri, 05/19/2023 - 08:34

సాక్షి, హైదరాబాద్‌: కర్ణాటక ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్‌ పార్టీలోలో జోరు పెరిగింది. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలు చేపడుతూ పార్టీ నేతలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో అన్న విషయాన్ని స్పష్టంగా వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సొంటిరెడ్డి పున్నారెడ్డి 2018 నుంచి సీపీఆర్‌ ట్రస్టు ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఆయనకి టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి అండదండలు పుష్కలంగా ఉండగా రేవంత్‌ రెడ్డి సహకారం కూడా ఉందని ప్రచారం చేసుకుంటున్నాడు. 

► అదేవిధంగా 1986 నుంచి పార్టీలో ఉంటూ వస్తున్న మరో ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి సైతం తనకి టికెట్‌ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్‌ గాంధీ పాదయాత్రలో కీలకంగా వ్యవహరించి ఆయన అధిష్టానం దృష్టిలో పడ్డారు. రేవంత్‌రెడ్డి ఆశీస్సులు సైతం ఉన్నాయని ప్రచారం ఉంది. 

► ఇదే క్రమంలో పీసీసీ ప్రతినిధి కొలను హనుమంత్‌రెడ్డి 70 రోజులుగా హాథ్‌ సే హాథ్‌ జోడో అభియాన్‌ యాత్రను చేస్తున్నారు. తప్పకుండా ప్రజల్లో ఉంటున్న ఆయన టికెట్‌ వస్తుందని ధీమాతో ఉన్నారు.

► అదేవిధంగా మొదటి నుంచి టీపీసీసీ అధ్యక్షుడికి అత్యంత సన్నిహితంగా ఉండే జ్యోత్స్నా శివారెడ్డి సైతం టికెట్‌ కోసం రేసులో ఉన్నారు.  

► అయితే పార్టీ అధిష్టానం ఈ నలుగురిలో ఎవరికి ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తారన్నది అంతుచిక్కకుండా ఉంది. ఎవరికివారు పోటీపడి ప్రచారంలో మునిగిపోతూ తమ ఉనికిని చాటుకుంటూ ముందుకు సాగుతుండగా ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరిలో ఎవరికో ఒకరికి ఎమ్మెల్యే టికెట్‌ వరించే అవకాశం ఉందని ఆ పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.  

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి