Breaking News

జమ్ముకు పర్యటకులు ఖైదీల్లా వచ్చి వెళ్తున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా

Published on Thu, 09/12/2024 - 13:58

శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే  ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి టూరిజం అభివృద్ధి చెందినట్లు బీజేపీ చేస్తున్న వ్యాఖ్యపై మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా స్పందించారు. టూరిజం అభివృద్ధి చెందటం కాదు..టూరిస్టులు ఖైధీల వలే వచ్చి వెళ్తున్నారని అన్నారు. ఆయన ఓ జాతీయా మీడియాతో వచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. 

‘ఒకవైపు.. జమ్ము కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని చెబుతూనే అమర్‌నాథ్ యాత్ర సందర్భంగా కేంద్రం భారీగా  భద్రతా బలగాలను మోహరిస్తున్నాయి.అమర్‌నాథ్‌ యాత్ర సందర్భంగా  ఇంత భారీగా భద్రతా బలగాలను ఎప్పుడూ మోహరించలేదు. జమ్ము కశ్మీర్‌కు వచ్చే.. టూరిస్టులు భయం కుప్పిట్లో ఖైదాల వలే బస్సుల్లో వచ్చి.. వెళ్లిపోతున్నారు. 

భారత దేశానికి స్వాతంత్ర్యం రావడానికి  సుమారు 200 ఏళ్ల కాలం పట్టిందిర. ఆర్టికల్‌ 370 పునరుద్ధరణకు కూడా చాలా సమయం పడుతుంది. గత ఐదేళ్లుగా జమ్ము కశ్మీర్‌పై పూర్తి నియంత్రణ ఉన్నప్పటికీ కేంద్రం ఇక్కడ ఉగ్రవాదాన్ని​ అదుపులోకి తీసుకురాలేకపోయింది. దీనికి రియాసి జిల్లాలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై జూన్‌లో జరిగిన ఉగ్రదాడే నిదర్శనం’ అని అన్నారు.

ఇక.. జమ్ము కశ్మీర్‌లో సెప్టెంబర్18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, అక్టోబర్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. జమ్ము కశ్మీర్‌లో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

చదవండి: అలా నిరూపిస్తే రాజీనామా చేస్తా: జమ్ము ఎల్జీ

Videos

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

Photos

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!