Breaking News

రైతు భరోసాకు పదెకరాలు పరిమితి పెట్టండి

Published on Wed, 06/26/2024 - 03:50

సాక్షి, హైదరాబాద్‌: రైతు భరోసా పథకానికి పరిమితులు విధించాలని.. గతంలో మాదిరి అందరికీ కాకుండా, పదెకరాల వరకు భూములున్న రైతులకే పెట్టుబడి సాయం అందించాలని రైతులు పేర్కొన్నారు. కొందరు రైతులు మాత్రం ఐదెకరాల వరకు పరిమితి పెట్టినా మంచిదేనని అన్నారు. చాలా మంది రైతులు సాగులో ఉన్న భూమికి, సాగుచేసే వారికే పెట్టుబడి సాయం అందించాలని కోరారు. ఆదాయ పన్ను చెల్లించే రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని కోరారు. 

విదేశాలకు వెళ్లే తమ పిల్లల విద్యా రుణాల కోసం బ్యాంకులకు ఆదాయ పన్ను స్టేట్‌మెంట్లు చూపించాల్సి వస్తుందని.. కాబట్టి ఆదాయ పన్ను చెల్లించేవారికి కూడా రైతుభరోసా ఇవ్వాలని సూచించారు. ప్రతీ వారం నిర్వహించే ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ‘రైతు భరోసా’పై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రైతుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. కొండలు, గుట్టలు, రియల్‌ ఎస్టేట్‌ భూములు వంటి వాటికి రైతు భరోసాను నిలిపివేయాలని కోరారు.

దొడ్డు రకాల వరికీ బోనస్‌ ఇవ్వాలి
సన్న వడ్లకు రూ.500 బోనస్‌ ఇస్తామని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో.. చాలా మంది రైతులు దొడ్డు రకం వరికి కూడా బోనస్‌ ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో దొడ్డు వరి సాగు చేసేవారే ఎక్కువని, వారికీ బోనస్‌ ఇస్తేనే గిట్టుబాటు ధర లభిస్తుందని పేర్కొన్నారు. సన్న రకాలకు ఎటూ డిమాండ్‌ ఉంటుందని.. మార్కెట్లోనూ మద్దతు ధర కంటే ఎక్కువగా రేటు పలుకుతుందని వివరించారు. ఇక సీజన్‌ సమయంలో పంటల సాగుకు అవసరమైన కూలీల కొరత ఉంటుందని.. దొరికినా ఖర్చు ఎక్కువ అవుతుందని అనేక మంది రైతులు వాపోయారు. అందువల్ల వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు ఐదేళ్లుగా వ్యవసాయ యంత్రాల సరఫరా నిలిచిపోయిందని, దాంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

రైతుబంధుతో రూ.25,670 కోట్లు వృథా: మంత్రి తుమ్మల
గతంలో సాగులో లేని భూములకు కూడా రైతుబంధు వర్తింపజేసి.. 12 విడతల్లో దాదాపు రూ.25,670 కోట్ల ప్రజాధనం వృధా చేశారని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆరోపించారు. 93 శాతం వాటా ఉన్న సన్న, చిన్నకారు రైతుల వాటా రైతుబంధు మొత్తంలో 68 శాతం కూడా లేదని.. దానికితోడు 17.5 శాతం ఉన్న కౌలు రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం రైతుబంధు స్థానంలో రైతుభరోసా పథకాన్ని తీసుకొస్తోందని, పెట్టుబడి సాయాన్ని ఎకరానికి రూ.15 వేలకు పెంచుతున్నామని చెప్పారు. 

అయితే రైతుబంధు తరహాలో ప్రజాధనం వృథా కాకుండా ఉండేలా పటిష్ట విధానాల రూపకల్పనకు తమ ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. రైతునేస్తం కార్యక్రమంలో రైతులు వెల్లడించిన, రాత పూర్వకంగా సేకరించిన సూచనలను క్రోడీకరించి నివేదిక తయారు చేయాలని వ్యవసాయశాఖ డైరెక్టర్‌ గోపిని మంత్రి ఆదేశించారు. తమ ప్రభుత్వం రైతుభరోసాకు సంబంధించి ఎటువంటి విధానపరమైన నిర్ణయాలు ఇంకా తీసుకోలేదని.. పూర్తిగా అందరి అభిప్రాయాలు తీసుకున్నాక, శాసనసభలో చర్చించాక పథకాన్ని తీసుకొస్తామని చెప్పారు. ఆలస్యమైనప్పటికీ అర్హులకు మాత్రమే అందేలా రైతుభరోసాకు రూపకల్పన చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ చిన్నారెడ్డి, కిసాన్‌ సెల్‌ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, రైతుసంఘం నాయకుడు అన్వేశ్‌రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు.  

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)