Breaking News

కాంగ్రెస్‌ మరింత దిగజారింది: అమిత్‌ షా మండిపాటు

Published on Tue, 04/30/2024 - 12:12

ఢిల్లీ, సాక్షి: రాజకీయ పార్టీలు ప్రజలకు ఏం చేస్తామో చెప్పి పోరాడాలని, అంతేగానీ తప్పుడు వీడియోలతో కాదని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. తనపై ఫేక్‌ వీడియో ద్వారా జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించిన ఆయన.. రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ రాజకీయాలు మరింత దిగజారిపోయానని మండిపడ్డారు.

మంగళవారం ఢిల్లీలో ఆయన పలువురు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. బీజేపీ 400 సీట్ల లక్ష్యంపై కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం చేస్తోంది. బీజేపీకే గనుక 400 సీట్లు దాటితే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని చెబుతోంది. కానీ,  ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల కోటాల్లో కోత విధించింది కాంగ్రెస్సే. ఆంధ్రా, కర్ణాటకలో రిజర్వేషన్లపై కోత పెట్టింది.

మాకు(బీజేపీ) గత రెండు పర్యాయాలు సంపూర్ణ మెజారిటీ వచ్చింది. కానీ, కాంగ్రెస్‌ మాదిరిగా మేం ఎమర్జెన్సీ విధించలేదు. ఆర్టికల్‌ 370, ట్రిపుల్‌ తలాక్‌ రద్దు కోసం ఆ సంపూర్ణ అధికారాన్ని ఉపయోగించాం.  

ఈ దఫా బీజేపీ 400 సీట్లు సాధిస్తుంది. ముగిసిన రెండు విడతల ఎన్నికల్లోనే వందకు పైగా సీట్లు వస్తాయని నమ్మకం ఉంది. దక్షిణ భారతంలోనూ బీజేపీకి మంచి ఫలితాలు వస్తాయి అని అమిత్‌ షా ఆశాభావం వ్యక్తం చేశారు.

రాహుల్‌ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ మరింతగా దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. ఫేక్‌ వీడియోలు సృష్టించి ప్రచారం చేయడం బాధాకరం. కాంగ్రెస్‌ కూటమి ఓటమి భయంలో ఉండి పోయాయి. అందుకే అమేథీలోనూ పోటీకి కాంగ్రెస్‌ భయపడుతోంది అని షా అన్నారు. 

కాంగ్రెస్‌ మరింత దిగజారింది: అమిత్‌ షా మండిపాటు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)