Breaking News

నేను అడిగాకే.. డిప్యూటీ సీఎంగా షిండే ఒప్పుకున్నారు: ఫడ్నవీస్‌

Published on Fri, 12/06/2024 - 15:55

ముంబై: తాను అడిగితేనే శివసేన అధినేత ఏక్‌నాథ్ షిండే డిప్యూటీ సీఎంగా ఉండటానికి అంగీకరించారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.  వ్యక్తిగతంగా షిండేతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి రెండు రోజుల ముందే షిండేతో భేటీ అయ్యానని, అప్పుడే ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండేందుకు అంగీకరించారని వెల్లడించారు.  ఓ జాతీయ మీడియాకు శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫడ్నవీస్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

కాగా దేవేంద్ర ఫడ్నవీస్‌ నేతృత్వంలో మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. 11 రోజుల ఉత్కంఠకు తెరదీస్తూ ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నవీస్‌ ఉపముఖ్యమంత్రులుగా ఏక్‌నాథ్‌ షిండే, అజిత్‌ పవార్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో ఫడ్నవీస్‌ ఆయన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత జరిగిన మహాయుతి తొలి సమావేశంలోనే ముఖ్యమంత్రి బీజేపీ నుంచి ఉండేందుకు షిండే అంగీకరించారని ఫడ్నవీస్ పేర్కొన్నారు. ‘అయితే షిండే ప్రభుత్వంలో భాగం కాకూడదని, కూటమి సజావుగా సాగేందుకు సమన్వయ కమిటీకి నేతృత్వం వహించాలని శివసేనలోని ఒక వర్గం భావించింది. తమ పార్టీ నుంచి ముఖ్యమంత్రి కావాలని శివసేన నేతలు కోరుకునేవారు. కానీ, మా మనసులో ఎలాంటి సందేహం లేదు. వ్యక్తిగతంగా షిండేతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. నేను ఆయనను కలిసిన తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండటానికి అంగీకరించారు’ అని తెలిపారు.

అయితే  గత ప్రభుత్వంలో రెండున్నరేళ్ల పాటు సీఎం పదవిలో కొనసాగిన షిండే.. డిప్యూటీ సీఎం బాధ్యతలను తీసుకునేందుకు నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునేందుకు షిండే అంగీకరించడంతో ఆ ఊహాగానాలకు చెక్‌ పడింది.

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)