Breaking News

అజారుద్దీన్‌కు టికెట్‌.. విష్ణువర్థన్‌ రెడ్డి రియాక్షన్‌ ఇదే..

Published on Sat, 10/28/2023 - 10:57

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. టికెట్‌ ఆశించి భంగపడిన నేతలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అధికార పార్టీ సహా ప్రతిపక్ష పార్టీ నేతలు ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. సమయం చూసి వేరే పార్టీల్లోకి జంప్‌ చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్‌లో టికెట్‌ ఆశించినా అది దక్కకపోవడంతో పీజేఆర్‌ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్‌ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

వివరాల ప్రకారం.. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జూబ్లీహిల్స్‌ టికెట్‌ దక్కకపోవడంతో విష్ణువర్ధన్‌ రెడ్డి సీరియస్‌ అవుతున్నారు. కాంగ్రెస్‌ హైకమాండ్‌ జూబ్లీహిల్స్‌ టికెట్‌ను మాజీ క్రికెటర్‌, సీనియర్‌ నేత అజారుద్దీన్‌కు కేటాయించింది. ఈ క్రమంలో విష్ణువర్ధన్‌ రెడ్డి శనివారం పార్టీ అనుచరులతో సమావేశం కానున్నారు. హైకమాండ్‌ తీరుపై విష్ణువర్ధన్‌ రెడ్డి కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా విష్ణువర్దన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నాకు ఎందుకు టిక్కెట్ ఇవ్వలేదో అర్థం కావడం లేదు. ఒకే కుటుంబంలో రెండు టిక్కెట్లు చాలా మందికి ఇచ్చారు. మాకెందుకు ఆ నిబంధన అడ్డు వచ్చింది? నేను జూబ్లీహిల్స్‌లో గెలుస్తానని అన్ని రిపోర్టులు చెప్తున్నాయి. కావాలనే నాకు టిక్కెట్ ఇవ్వలేదు. టికెట్‌ ఇస్తామని ఢిల్లీ పెద్దలు చాలాకాలంగా చెబుతూనే ఉన్నారు. కానీ, అనూహ్యంగా జాబితాలో నా పేరు లేకపోవడంతో నేనే షాక్‌ అయ్యాను. పార్టీకి ఎవరు ముఖ్యమో అది ముందు గమనించాలి. కార్యకర్తల సమావేశం తర్వాత నా భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తాను. నన్ను పార్టీ నుంచి పొమ్మనలేక పొగ పెడుతున్నారు. నేనే వేరే పార్టీలో చేరితే మంచి స్థానం ఇస్తామని ఇప్పటికే పలు ఆఫర్లు వచ్చాయి’’ అని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అనుచరులతో భేటీ తర్వాతే పార్టీ మార్పు లేదా తదితర అంశాలపై నిర్ణయం తీసుకుంటానన్నారు. 

ఇది కూడా చదవండి: రేవంత్‌కు కొత్త టెన్షన్‌.. 19 స్థానాల్లో ఎవరు?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)