Breaking News

అసెంబ్లీలో సీఎం రేవంత్‌ వ్యాఖ్యలతో సబిత కన్నీరు

Published on Wed, 07/31/2024 - 13:16

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సీఎం రేవంత్‌.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై కామెంట్స్‌ నేపథ్యంలో ఆమె కన్నీరుపెట్టుకున్నారు. తనను ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్‌..

  • కాంగ్రెస్‌లో ఉండి ఇక్కడ ముంచి అక్కడి వెళ్లారు.
  • బీఆర్‌ఎస్‌ నేతల వెనుక ఉన్న అక్కలను నమ్మితే అంతే..
  • వాళ్ల మాటలు వింటే జూబ్లీ బస్టాండ్‌లో నిలబడాల్సి వస్తుంది.
  • బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క మహిళలకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు.
  • సబితను సొంత అక్కగానే భావించాను.


కాంగ్రెస్‌ నేతల వ్యాఖ్యలకు కన్నీరు పెట్టిన సబితా ఇంద్రారెడ్డి.

  • అసెంబ్లీలో సబిత భావోద్వేగం.
  • నన్ను ఎందుకు టార్గెట్‌ చేశారు.
  • రేవంత్‌ ఏ పార్టీ నుంచి వచ్చారు.
  • కాంగ్రెస్‌ నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నాను.
  • పార్టీ మార్పులపై చర్చ జరగాలి.
  • రేవంత్‌ను కాంగ్రెస్‌లోకి నేనే ఆహ్వానించాను.
  • ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లు పార్టీలు మారి రాలేదా?
  • అక్కడున్న కాకి మా ఇంటి మీద వాడితే కాల్చుతా అన్నారు రేవంత్ రెడ్డి.
  • రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించింది నేనే.
  • ఒక ఆడబిడ్డకు బాధ అవుతుంటే వినే స్థితిలో లేరా?
  • సీఎం రేవంత్ రెడ్డి నన్ను ఎందుకు టార్గెట్ చేశారు?
  • వెనక కూర్చున్న అక్కలు ఎవరిని మోసం చేశారు?
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించి భవిష్యత్తు చూపించాం.
  • ముఖ్యమంత్రి ఎవరిని అవమానిస్తున్నారు ఆలోచన చేసుకోవాలి?
  • ఆడిబిడ్డలాగా ఉన్న మేము ఎవరిని మోసం చేసాము?
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ​కామెంట్స్‌.. 

  • అక్కగా నేను సబితా ఇంద్రారెడ్డిని నమ్మాను.
  • నన్ను మల్కాజిగిరిలో పోటీ చేయమని చెప్పి.. కాంగ్రెస్‌ను వదిలి బీఆర్ఎస్‌లోకి వెళ్లారు.
  • ఒకవైపు నన్ను మల్కాజిగిరిలో పోటీ చేయమని.. మరోవైపు కేసీఆర్ మాటలు నమ్మి ఆ పార్టీలో చేరారు.
  • మల్కాజ్‌గిరిలో పోటీ చేయమని, బీఆర్ఎస్‌లో చేరి మంత్రి పదవి పొందారు.
  • రాజ్ భవన్ వెళ్లి వచ్చాక అన్ని అంశాలపై సమాధానాలు చెప్తా అన్ని విషయాలు బయటపెడతాను.

 

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్‌..

  • కాంగ్రెస్ పార్టీ సబితా ఇంద్రారెడ్డికి ప్రాధాన్యత ఇచ్చింది.
  • పదేండ్లు మంత్రి పదవి ఇచ్చి గౌరవించింది.
  • 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు.
  • కాంగ్రెస్ పార్టీ దళిత నేతగా ఉన్న నాకు సీఎల్పీ, ఎల్‌ఓపీగా బాధ్యతలు ఇచ్చారు.
  • సబితా ఇంద్రారెడ్డి రెడ్డి నా వెనుక ఉండి నన్ను సీఎల్పీ, ఎల్ఓపీగా కాకుండా అధికారం కోసం పార్టీ మారారు.
  • సబితా ఇంద్రారెడ్డి ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేస్తున్నారు.
  • కాంగ్రెస్ పార్టీ పరువు తీసి, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు సబితా ఇంద్రారెడ్డి.
  • డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై మరోసారి ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్
  • స్పీకర్ పోడియం ముందు వచ్చి నిరసన చేస్తున్న ఎమ్మెల్యేలు.
  • మహిళా నాయకురాళ్లపై మంత్రులుగా ఉండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా అంటున్న బీఆర్ఎస్.

 

బీఆర్‌ఎస్‌ నేతల నిరసన..

  • స్పీకర్ పోడియం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన.
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళనపై స్పీకర్ ఆగ్రహం.
  • రెండు గంటలు సమయం ఇచ్చిన చైర్‌కు బీఆర్ఎస్ మర్యాద ఇవ్వడం లేదు.
  • మహిళలను రెచ్చగొట్టడం సరైన పద్ధతి కాదు
  • ఎంత అవకాశం ఇచ్చిన నిరసన చేయడం సరైన పద్ధతి కాదు.
     

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)