Breaking News

అక్కరకురాని సుట్టాలెందుకు.. కాంగ్రెస్‌, బీజేపీపై కేటీఆర్‌ సెటైర్లు

Published on Mon, 05/06/2024 - 10:51

సాక్షి, రాజన్న సిరిసిల్ల: తనకు రాజకీయంగా జన్మనిచ్చిందే సిరిసిల్ల అని చెప్పుకొచ్చారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌. తెలంగాణలో మోచేతికి బెల్లం పెట్టి.. మోసపూరిత హామీలతో కాంగ్రెస్‌ పార్టీ గెలిచిందన్నారు. అలాగే, రాముడు అందరి వాడు.. మతం పేరుతో ఓట్ల రాజకీయం చేస్తున్నారని బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, కేటీఆర్‌ సోమవారం సిరిసిల్లలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ..‘బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు నేత కార్మికుల కోసం మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కార్మికులను కాపాడుకున్నాం. సిరిసిల్ల పట్టణాన్ని సుందరంగా తీర్చి దిద్దుకున్నాం. మీరు నన్ను ఇక్కడ గెలిపించినా.. కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి విజయం సాధించింది. మోచేతికి బెల్లం పెట్టి.. మోసపూరిత హామీలతో గెలిచింది.

ఆరు గ్యారంటీలు అమలు అయ్యాయా చెప్పండి?. అబద్ధాలు చెబితే డిజిటల్‌ ప్రపంచంలో ఒక్క నిమిషంలో దొరికిపోతారు. కేసీఆర్‌ ప్రభుత్వం పోయాక అన్నామో రామచంద్ర అనే పరిస్థితి వచ్చింది. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ను పట్టుకుని కాంగ్రెస్‌ నాయకులు అనేక మాటలు, బూతులు మాట్లాడుతున్నారు. ఓట్ల కోసం ఒక లెక్క.. ఓట్లు వేయించుకున్నాక ఒక లెక్క అన్నట్టుంది కాంగ్రెస్‌ పార్టీ తీరు. కేసీఆర్‌ మళ్లీ కావాలనుకుంటే మే 13వ తేదీన కారు గుర్తుకు వేసి గెలిపించండి.. తెలంగాణలో​ శాసించే అధికారం వస్తుంది.

బీజేపీ నేతలు మతం పేరుతో రాజకీయం చేస్తున్నారు. రాముడు అందరివాడు. వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న దేవాలయాలు బీజేపీ పుట్టకముందు నుంచే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధర తగ్గినా పెట్రోల్‌, డీజిల్‌ రేట్లపై పన్నులు వేసి మోదీ డబ్బులు వసూలు చేస్తున్నాడు. మళ్లీ అబ్కీ బార్‌ 420 అంటున్నాడు. అక్కరకురాని చుట్టాలకు ఎందుకు ఓటు వేయాలి. నాకో జోడీ దారు దొరికితే.. రాష్ట్రం, కేంద్రంపై పోరాడే శక్తి వస్తుంది’ అంటూ కామెంట్స్‌ చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)