Breaking News

కాంగ్రెస్‌ తీరు దారుణం.. గోదారిని చూస్తే బాధేస్తోంది: హరీష్‌ రావు

Published on Sat, 07/13/2024 - 21:19

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలన తీరుపై మాజీ మంత్రి హరీష్‌ రావు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరెంట్‌ కోతలు మళ్లీ మొదలయ్యాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం మళ్లీ పాత రోజులను గుర్తుకు తెస్తోంది అంటూ కామెంట్స్‌ చేశారు.

కాగా, హరీష్‌ రావు శనివారం రవీంద్రభారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఏ ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రాన్ని సాధించామో అదే స్ఫూర్తితో తెలంగాణలో పని చేశాం. కష్టల్లో నుంచి పాటలు వచ్చాయి. రైతుల వ్యతల్లో నుంచి పాటలు వచ్చాయి. నీళ్ల కోసం కూడా పాటలు వచ్చాయి. సదాశివుడు రాసిన పాట కూడా అంతే స్థాయిలో గుర్తింపు పొందింది. తలాపున పారుతుంది గోదారి.. చేను చెలక ఏడారి పాట తెలంగాణ నీళ్ల గోసను చూపెట్టింది.

తెలంగాణ వచ్చాక ఎర్రటి ఎండలో కూడా మత్తల్లు దూకిన చెరువులు కనిపించాయి. అనతి కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించాం. కొంచెం బాధ కలిగే అంశం ఏంటంటే ఇప్పుడు గోదావరి ఎండిపోయింది. పది పదిహేను రోజుల నుంచి గోదావరి నీళ్ళు వస్తున్నా ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయటం లేదు. కనీసం ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. మళ్ళీ పాత రోజులు తీసుకొచ్చింది కాంగ్రెస్. ప్రభుత్వంపై నిందలు వేయటం కాదు, రైతుల కన్నీళ్ళు తుడవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా.

మళ్లీ రాష్ట్రంలో కవులకు, కళాకారుల పెన్నులకు పదును పెట్టాల్సిన అవసరం వచ్చిందేమో. రోజు పేపర్లు చూడగానే రైతులు ఆత్మహత్యలు కనబడుతున్నాయి. కరెంట్ కోతలు మొదలయ్యాయి. అనేక సమస్యలు జనాన్ని వెంటాడుతున్నాయి. కళాకారులకు మూడు నెలల నుంచి జీతాలు రావటం లేదని నాకు చెప్తున్నారు. ప్రతిపక్షంగా ప్రజల తరఫున మేము పోరాడుతాం. సామాజిక బాధ్యతగా కళాకారులు పోరాడాలి. మళ్లీ మీ పెన్నులకు పదును పెట్టాలి’ అని చెప్పుకొచ్చారు. 

Videos

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)