Breaking News

రాజ్యసభకు వినేశ్‌ ఫోగట్‌?

Published on Thu, 08/08/2024 - 19:47

ఢిల్లీ: ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌పై 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హత వేటు పండింది. ఈ క్రమంలో ఆమెకు దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ ప్రముఖులు అండగా నిలిచారు. ఇండియా కూటమి పార్టీల నేతలు ఈ వినేశ్‌ అనర్హత అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరపాలని పట్టుపట్టాయి. తాజాగా వినేశ్‌ ఫోగట్‌  అనర్హత మాజీ హర్యానా సీఎం భూపేందర్‌ సింగ్‌ హూడా స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. 

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాజ్యసభ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్‌కు సంఖ్యాబలం ఉంటే వినేశ్‌ పేరును ప్రతిపాదించేవాడిని. ఆమె మనందిరికీ చాలా గర్వకారణం’’ అని అన్నారు. మరోవైపు.. భూపేంద్ర సింగ్‌ హూడా తనయుడు ప్రస్తుత కాంగ్రెస్‌ లోక్‌సభ ఎంపీ దీపేందర్‌ హూడా సైతం స్పందిస్తూ.. రాజ్యసభలో ఒక సీట్‌ ఖాళీ కాబోతోందని, దానికి ఫోగట్‌ను నామినేట్‌ చేస్తామని అన్నారు. ఆమె ఓడిపోలేదని, మన అందిరి మనసులు గెలిచిందన్నారు.

అయితే  కాంగ్రెస్‌ నేతలు చేసిన వ్యాఖ్యలపై వినేశ్‌ ఫోగట్‌ పెద్దనాన్న మహవీర్‌ ఫోగట్‌ స్పందించారు. వారి మాటలు ఒక పోలిటికల్‌ స్టంట్‌ అని అన్నారు. భూపేందర్‌ సింగ్‌ హూడా హర్యానా సీఎంగా ఉన్న సమయంలో తన కూతురు గీతా ఫోగట్‌ సైతం పలు పతకాలు సాధించిందని, కానీ ఆమెను రాజ్యసభకు పంపలేదని అన్నారు. మెజార్టీ ఉంటే వినేశ్‌ను రాజ్యసభకు పంపేవాడినని భూపీందర్ హుడా  ఇప్పుడు  అంటున్నారు. మరీ ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు గీతా ఫోగట్‌ను ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నాయకులు మాటాలు పొలిటికల్‌ స్టంట్‌  మాత్రమేనని  అన్నారు.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)