Breaking News

ప్రజా క్షేత్రంలో ఏం హామీలు ఇచ్చారో గుర్తు చేసుకోండి: రేవంత్‌కు ఈటల సవాల్‌

Published on Sat, 10/19/2024 - 16:35

సాక్షి, నిజామాబాద్‌: గ్రూప్‌-1 విషయంలో సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ దుర్మార్గ జీవో ఇచ్చిందని, 29ని సడలించాలని నిరుద్యోగులు ఆందోళన నిర్వహిస్తున్నారని తెలిపారు. 

నిరుద్యోగుల ఆందోళనకు బీజేపీ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. రేవంత్ రెడ్డి సర్కార్ కొలువు దీరి ఏడాది కావస్తోందని.. ఇప్పటి వరకు ఇచ్చినా ఏ హామీ సరిగా అమలు కావడం లేదని మండిపడ్డారు.

‘ఏ రైతు అయినా రుణ మాఫీ కాకపోతే రెండు లక్షల రుణం తీసుకోండి రేవంత్‌ అన్నారు. నేను సీఎం కాగానే మాఫీ చేస్తామని అన్నారు. సూటిగా ఒకటే మాట అడుగుతున్నా. ప్రజా క్షేత్రంలో ఏం హామీలు ఇచ్చారో గుర్తు చేసుకోండి. పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యిందని ప్రజలు భావిస్తున్నారు. 

పెంచిన పింఛన్లు దేవుడెరుగు.. ఉన్న పింఛన్లు ఎత్తేస్తున్నారు. దేవుళ్ళ మీద ఒట్లు వేశారు. గట్టు మీద పెట్టేశారు. రిటైర్డ్ అయ్యిన ఉద్యోగులకు సెటిల్ మెంట్‌లు  చేసే పరిస్థితి లేదు. ఆర్థిక పరిస్థితి బాగాలేదని రేవంత్ రెడ్డి చెప్పారు. ఉద్యమ కార్యాచరణ ప్రకటించబోతున్నారు.’ అని ఈటల పేర్కొన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)