Breaking News

‘ఢిల్లీని తాగుబోతు రాష్ట్రంగా మార్చారు’

Published on Sat, 02/08/2025 - 18:49

హైదరాబాద్‌:  ఢిల్లీ ప్రజల బతుకులు మారాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని అక్కడ ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని ఎంపీ ఈటెల రాజేందర్‌ పేర్కొన్నారు.  ఈరోజు(శనివారం) ఈటెల రాజేందర్‌ బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మాట్లాడుతూ.. ఇది ఢిల్లీ(Delhi Assembly Elections 2025) ప్రజల స్పష్టమైన తీర్పు అని తేల్చిచెప్పారు.ఢిల్లీ గల్లీలో దుర్గంధం చూస్తే అన్నం కూడా తినలేం. ఢిల్లీ ప్రజల బతుకులు మారాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని ఈ తీర్పునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో మోదీకి 400 సీట్లు ఇవ్వనందుకు ప్రజలు బాధపడుతున్నారు. 

అందుకే ఆ తర్వాత జరిగిన అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం అందిస్తున్నారు ప్రజలు. ఢిల్లీలో కేజ్రీవాల్‌ బాగుపడ్డాడు తప్ప.. పేద ప్రజల బతుకులు మారలేదు. గల్లీ గల్లీలో లిక్కర్‌ షాపులు ఏర్పాటు చేశారు. ఢిల్లీని తాగుబోతు రాష్ట్రంగా మార్చిన ఘనత కేజ్రీవాల్‌ది. లిక్కర్ స్కాం తో ఢిల్లీ ప్రజలు తలదించుకున్నారు. ఢిల్లీ ప్రజల చేతిలో కేజ్రీవాల్‌, ిసిసోడియాలు చావుదెబ్బ తిన్నారు. దేశంలో కాంగ్రెస్‌ పార్టీకి భవిష్యత్‌ లేదు.

అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం చేసే సత్తా  మోదీ(Narendra Modi)కే ఉందని ప్రజలు నమ్ముతున్నారు.  తెలంగాణలో పదేళ్లు బీఆర్‌ఎస్‌ పాలన చూశాక వారికి పొరపాటున కూడా ఓటేయొద్దని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో అతి తక్కువ కాలంలో వ్యతిరేకత మూటగట్టుకుంది. తొందర్లోనే ఢిల్లీ తీర్పు తెలంగాణలో రాబోతుంది. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ దుర్మార్గాలపై బీజేపీ మాత్రమే కొట్లాడుతుందని ప్రజలు నమ్ముతున్నారు’ అని ఈటెల పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ దీన స్థితి చూస్తే జాలేస్తోంది: కిషన్‌రెడ్డి

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)