Breaking News

తెలంగాణలో చంద్రబాబు రాజకీయంపై ఈటల సంచలన వ్యాఖ్యలు

Published on Wed, 11/01/2023 - 17:32

సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో చంద్రబాబు రాజకీయంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టిన చంద్రబాబు.. కాంగ్రెస్‌ను గెలిపించే ప్రయత్నం చేస్తున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. బాబు జైలు నుంచి విడుదలైన తర్వాత కాంగ్రెస్‌ను పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 2018 లో కాంగ్రెస్‌తో కలిసి తెర ముందు ప్రచారం చేసిన చంద్రబాబు.. 2023లో కాంగ్రెస్ గెలుపుకు తెరవెనుక ప్రయత్నం చేస్తున్నారని ఈటల  ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్‌పై ప్రజలకు విశ్వాసం లేదని, బీజేపీ వస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ఈటల అన్నారు.

కాగా, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తోక ముడిచింది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ పార్టీకి రాజీనామా కూడా చేశారు. చంద్రబాబు, లోకేష్‌ తీరుపై తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.

‘టీడీపీ ఇక్కడ పోటీ చేయొద్దనడం వెనుక ఎవరున్నరో గానీ, మన చౌదరీలే కాంగ్రెస్‌కు ఓటేయమని క్లియర్‌గా చెబుతున్నరు. బాబును మొన్న కలిసినప్పుడు మన కమ్మ వాళ్లే పోటీ చేయడం లేదని ప్రచారం చేస్తున్నరని క్లియర్‌గా చెప్పిన. టీడీపీ వాళ్లే కాంగ్రెస్‌కు ఓటేయమని చెబితే ఎట్ల. వీళ్లు ప్రచారం చేసినా.. కొందరే కాంగ్రెస్‌ అంటున్నరు. మిగతా వాళ్లు బీఆర్‌ఎస్‌కు ఓటేయాలంటున్నరు’’ అంటూ కాసాని వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఓ లెక్క. జనరల్‌ ఎన్నికల్లో చేయకపోతే ఎట్ల?’ అంటూ కాసాని ప్రశ్నించిన సంగతి తెలిసిందే.


చదవండి: బాబుకు కోపమొచ్చింది.. అచ్చెన్న పదవి ఊస్టింగేనా? 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)