Breaking News

అవి రైతుల పాలిట ఉరితాళ్లు

Published on Wed, 07/17/2024 - 05:21

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి విధించిన షరతులు రైతుల పాలిట ఉరితాళ్లుగా బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అభివరి్ణంచారు. ఈ నిబంధనలు రైతాంగాన్ని వంచనకు, మోసానికి గురిచేసేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల శాపనార్ధాలు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి తగలడం ఖాయమన్నారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో ఈటల రాజేందర్‌ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా గతంలో షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామని ఇచి్చన మాటకు కట్టుబడి ఉండాలని డిమాండ్‌ చేశారు.

కేసీఆర్‌ మాదిరిగా రేవంత్‌ రెడ్డి కూడా అద్దాల మేడలో కూర్చొని, తనకు ఐదేళ్లపాటు అధికారం ఇచ్చారనే ఆహంకారంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రూ.34 వేల కోట్ల రైతుల రుణమాఫీని బేషరతుగా చేస్తామన్న రేవంత్‌ రెడ్డి, ఇప్పుడు నిబంధనల పేరుతో హల్లికి హల్లి సున్నకు సున్నా అన్నట్టు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అతి తక్కువ కాలంలో ప్రజాక్షేత్రంలో రే వంత్‌ ప్రభుత్వం నమ్మకం కోల్పోయిందన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై సీఎం రేవంత్‌కు ఉన్న ధ్యాస రైతు రుణమాఫీ, రూ.500 బోనస్, ఆడబిడ్డలకు రూ.2500, రూ.4వేల పెన్షన్, ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి రూ.4 వేలు, కాలేజీ పిల్లలకు స్కూటీలు.. వంటి హామీలను అమలు చేయడంపై లేదన్నారు. ఫిరాయింపుల పర్వం చూస్తుంటే కేసీఆర్‌ జుట్టు నుంచి రేవంత్‌రెడ్డి పుట్టినట్టు ఉందని ఎద్దేవాచేశారు. 

రేవంత్‌రెడ్డి చదువుకున్నారా? లేదా?  
‘తెల్లరేషన్‌ కార్డు ఎవరికి ఇస్తారు. రేవంత్‌రెడ్డి చదువుకున్నాడా? లేదా? మూడున్నర ఎకరాల తరిపొలం, ఏడు ఎకరాల కుష్కి పొలం ఉన్నవారికి మాత్రమే తెల్లరేషన్‌ కార్డు వస్తుంది. తెల్ల రేషన్‌ కార్డులు ఇవ్వక పదేళ్లు అవుతుంది. మీరు వచ్చి ఏడు నెలలు అవుతున్నా ఒక్క కార్డు ఇవ్వలేదు. రేషన్‌ కార్డు పేరుతో సగం మందికి, ఆదాయపన్ను పేరుతో 20%మందికి, రీ షెడ్యూల్‌ పేరుతో ఇంకొంత మందికి రుణమాఫీ ఎగ్గొడుతున్నారు. పొమ్మనక పొగబెట్టడం, ఎగబెట్టుడు తప్ప ఇంకొకటి లేదు’అని ఈటల ధ్వజమెత్తారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)