Breaking News

నేను జైలులో ఉన్నప్పుడు.. వాళ్లు తోలు బొమ్మలు: ఇంజనీర్‌ రషీద్‌

Published on Sun, 09/15/2024 - 19:19

శ్రీనగర్‌: బీజేపీ అనుకూల వ్యక్తిగా తనపై వస్తున్న ఆరోపణలను అవామీ ఇత్తెహాద్ పార్టీ(ఏఐపీ) చీఫ్‌, బారాముల్లా  ఎంపీ ఇంజనీర్‌ రషీద్‌ (షేక్‌ అబ్దుల్‌ రషీద్‌) ఖండించారు. సార్వత్రిక ఎన్నికల్లో తన గెలుపు ప్రధాని మోదీ ‘నయా కశ్మీర్‌’ విధానాల వల్ల ప్రజల్లో కలిగిన అసంతృప్తికి నిదర్శరనమని అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.

‘‘నాపై బీజేపీ అనుకూల వ్యక్తిని అనే ఆరోపణలు చేయటం చాలా సిగ్గుచేటు. ఇలాంటి ఆరోపణలు చేసినవాళ్లు సిగ్గుపడాలి. నేను ఒక్కడినే బీజేపీ చేతిలో బలిపశువును అయ్యాను. ఆర్టికల్‌ 370 రద్దు సమయంలో ఫరూఖ్‌ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లాలను కొన్ని  నెలల పాటు గృహనిర్బంధంలో ఉంచారు. కానీ, నేను మాత్రం తిహార్‌ జైల్‌లో ఉన్నా. 

ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఒమర్ అబ్దుల్లా , పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ)కి చెందిన మెహబూబా ముఫ్తీలు ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన  తర్వాత జమ్ము కశ్మీర్‌ ప్రజలను ఏకం చేయటంలో విఫలమయ్యారు.  కశ్మీర్‌ ప్రజలు  దృష్టిలో  ఒమర్‌ అబ్దుల్లా.. మహాత్మా గాంధీ లేదా సుభాష్ చంద్రబోస్ కాలేదు. మెహబూబా  ముఫ్తీ రజియా సుల్తాన్ లేదా మయన్మార్‌కు చెందిన ఆంగ్ సాన్ సూకీ కాలేకపోయారు. తోలుబొమ్మలు, రబ్బరు స్టాంపులుగా మిగిలి పోయారు.

2019లో ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన ఆరోపణలపై రషీద్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. జమ్ము కశ్వీర్‌ ఎన్నికల నేపథ్యంలో సెప్టెంబర్ 10న  తన పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేసేందుకు  ఆయను అక్టోబర్ 2 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు అయింది.  2024 సార్వత్రిక ఎన్నికలలో ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లాలో రషీద్  ఒమర్ అబ్దుల్లాపై విజయం సాధించారు.

చదవండి:  ఎన్నికల వేళ.. హర్యానా బీజేపీలో ట్విస్ట్‌!

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)