Breaking News

తెలంగాణ కేసీఆర్‌ పాలే అయ్యింది.. కావాలె కూడా..

Published on Mon, 09/25/2023 - 02:36

సాక్షి, హైదరాబాద్‌: ‘ఎవరి పాలైందిరో తెలంగాణ అని పాట రాసి, పాడితే కొంతమందికి ఎంటర్‌టైన్‌మెంట్‌ అయ్యిందే తప్ప..పదేళ్లయినా తెలంగాణకు ప్రత్యామ్నాయం రాలేదు. తెలంగాణ ఎవరి పాలయిందంటే బరాబర్‌ కేసీఆర్‌ పాలైంది. కేసీఆర్‌ పాలే కావాలి’అని ప్రముఖ గాయకుడు ఏపూరి సోమన్న అన్నారు. ఆదివారం ఆయన తెలంగాణభవన్‌లో బీఆర్‌ఎస్‌ నేతలు మధుసూదనాచారి, దేశప తి శ్రీనివాస్, బాల్క సుమన్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా సోమన్న మాట్లాడుతూ ఏ పార్టీ అయినా.. ఏ జెండా అయినా ప్రజల ఎజెండానే ముఖ్యమన్నారు. రాష్ట్రం వచ్చే ముందే తెలంగాణభవన్‌కు దూరమయ్యానని, పదేళ్ల తర్వాత తిరిగి సొంతింటికి వచ్చినట్టు ఉందని చెప్పారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ రామన్న (కేటీఆర్‌)ను సోమన్న కలిస్తే ఏదో జరిగిపోయింది అన్నట్టు చూస్తున్నారని, సోమన్నకు వాస్తవం తెలిసి బీఆర్‌ఎస్‌లోకి తిరిగి వచ్చారన్నారు.

ఒక పార్టీ కుమ్ములాట పార్టీ అయితే మరోపార్టీ చెట్టు ఎక్కించి చేతులు ఇడిసినట్టు వదిలేసిందని తెలిపారు. సాయి చంద్‌ కుటుంబాన్ని పార్టీ ఆదుకున్న తీరు ప్రశంసలు పొందిందన్నారు. ఉద్యమాల నుంచి వచ్చిన కవులు, గాయకులను శాసనమండలిలో కూర్చోబెట్టిన పార్టీ బీఆర్‌ఎస్‌ అని.. ఈ పార్టీలో హంతక రాజకీయాలు లేవని తెలిపారు. ఎమ్మెల్యే బాల్క సుమన్‌ మాట్లాడుతూ హరీశ్‌రావు, కేటీఆర్, కవితలు ఇతర పనుల్లో బిజీగా ఉండడం వల్ల సోమన్న చేరిక కార్యక్రమానికి రాలేదని వివరించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)