Breaking News

ఎన్సీపీలో కీలక మలుపు.. ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన అజిత్ పవార్‌

Published on Wed, 07/05/2023 - 15:47

అజిత్ పవార్ తిరుగుబాటుతో ఎన్సీపీలో చీలిక వచ్చిన సంగతి తెలిసిందే. తదనంతరం పార్టీపై పట్టు సాధించడానికి అజిత్ పవర్ వర్గం, శరద్ పవార్ వర్గం తీవ్రంగా కృషి చేస్తున్నారు. పార్టీ నాదంటే.. నాదంటూ ఇరువర్గాలు పంతం కొనసాగిస్తున్నాయి. పార్టీ పేరు, గుర్తును సొంతం చేసుకోవడానికి పోరాడుతున్నారు. ఈ క్రమంలో అజిత్‌ పవార్‌ వర్గం ఎన్నికల కమిషన్‌(ఈసీఐ)ను ఆశ్రయించింది. పార్టీ పేరు, గుర్తు కేటాయింపుకు సంబంధించిన పిటీషన్‌ను ఈసీఐకి దాఖలు చేశారు. 

పార్టీ పేరు, గుర్తుపై ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఎన్నికల కమిషన్‌ తన మాట కూడా వినాలని కోరుతూ ఇక శరద్ పవార్ నేతృత్వంలోని  ఎన్సీపీ ఇప్పటికే కేవియట్‌ దాఖలు చేసింది. తొమ్మిది మంది ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాలనే అంశంలోనూ ఈసీఐని శరద్‌ పవార్ వర్గం అభ్యర్థించింది. 

నేడు ఎన్సీపీలో ఇరువర్గాల బల ప‍్రదర్శన జరిగింది. ఇందులో అజిత్‌ పవార్‌ 30 మంది ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టుకోగా.. శరద్‌ పవార్‌ వెనక కేవలం 13 మంది మాత్రమే  ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్సీపీకి మొత్తం 53 ఎమ్మెల్యేల బలం​ ఉండగా.. తనకు 43 మంది శాసన సభ్యుల మద్దతు ఉందని అజిత్‌ పవార్‌ చెబుతున్నారు. అయితే అజిత్ వెనక ఉన్నది 13 మంది ఎమ్మెల్యేనంటున్న శరద్ పవార్‌ వర్గం ఆరోపిస్తుంది.

ఇదీ చదవండి: Sharad Pawar Vs Ajit Pawar.. నేడు ఎమ్మెల్యేల బలపరీక్ష.. ఎవరిది పైచేయి!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)