Breaking News

దూరదర్శన్, ఆలిండియా ప్రచారానికి సమయం కేటాయించిన ఈసీ

Published on Sat, 10/14/2023 - 00:35

సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలకు ప్రసారభారతి ఆధీనంలోని దూరదర్శన్, ఆలిండియా రేడియోల్లో ప్రచారానికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సమయం కేటాయించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం అండర్‌ సెక్రటరీ రాజేశ్‌ కుమార్‌ సింగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం తెలంగాణలో ఉన్న మొత్తం 10 గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలకు కలిపి బ్రాడ్‌కాస్ట్‌కు 898 నిమిషాలు, టెలికాస్ట్‌కు 898 నిమిషాలు కేటాయించారు. అందులో బ్రాడ్‌కాస్ట్‌కు, టెలికాస్ట్‌కు విడివిడిగా సమయం కేటాయించారు.

అత్యధికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి 277 నిమిషాలు కేటాయించగా, ఆ సమయాన్ని 5 నిమిషాలకు ఒక స్లాట్‌ చొప్పున 55 స్లాట్లుగా విభజించారు. ఇక కాంగ్రెస్‌ పార్టీకి 185 నిమిషాలను 5 నిమిషాల చొప్పున 37 స్లాట్లు.. బీజేపీకి 79 నిమిషాలను 5 నిమిషాల చొప్పున 15 స్లాట్లు, టీడీపీకి 62 నిమిషాలను 12 స్లాట్లుగా, ఏఐఎంఐఎం పార్టీకి 58 నిమిషాలను 11 స్లాట్లుగా, బీఎస్పీకి 55 నిమిషాలను 11 స్లాట్లుగా సీపీఐ (ఎం)కు 47 నిమిషాలను 9 స్లాట్లుగా కేటాయించారు. ఈ ప్రచారాన్ని ఎన్నికలకు రెండు రోజుల ముందు నిలిపివేయాల్సి ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)