Breaking News

రోజూ చేపలు తింటే ఐశ్వర్యరాయ్‌ లాంటి కళ్లు.. వివాదంలో మంత్రి

Published on Mon, 08/21/2023 - 19:57

ముంబై: మహారాష్ట్ర బీజేపీ మంత్రి తన దురుసు వ్యాఖ్యలతో వివాదంలో చిక్కకున్నారు. రోజు చేపలు తింటే హీరోయిన్‌ ఐశ్వర్యరాయ్‌ కళ్లు లాగా అందంగా ఉంటాయని పేర్కొంటూ నోరుజారారు. నందుర్బార్‌ జిల్లాలో జరిగిన ఓ బహిరంగ సమావేశంలో రాష్ట్ర గిరిజనశాఖ మంత్రి విజయ్‌ కుమార్‌ గవిత్‌ మాట్లాడుతూ.. రోజూ చేపలను తినే వ్యక్తుల చర్మం మృదువుగా మారుతుందని, కళ్లు మెరుస్తాయని అన్నారు. తమ వైపు ఎవరూ చూసిన వెంటనే ఆకర్షితులవుతారని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇందులో ‘ఐశ్వర్యరాయ్ గురించి నేను మీకు చెప్పలేదు కదూ.. ? ఆమె మంగళూరులోని సముద్ర తీరానికి సమీపంలో నివసించేది. ఐశ్యర్య రోజూ చేపలు తినేది. మీరు ఆమె కళ్ళు చూశారా? రోజూ చేపలు తింటే మీ కళ్లు కూడా టైశ్వర్యరాయ్‌ లాగే అందంగా తయారవుతాయి. చేపలో కొన్ని రకాల నూనెలు ఉంటాయి. అవి మీ చర్మాన్ని మృదువుగా  చేస్తాయి.’ అని మంత్రి చెప్పారు.

అయితే ఈ వ్యాఖ్యలపై మంత్రి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యలు చేయకుండా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించాలని ఎన్సీపీ ఎమ్మెల్యే అమోల్ మిత్కారీ మండిపడ్డారు. మరో బీజేపీ ఎమ్మెల్యే నితీష్‌ రాణే స్పందిస్తూ ‘నేను రోజు చేపలు తింటాను. నా కళ్లు కూడా అలాగే ఉండాలి. దీనిపై ఏమైనా పరిశోధన ఉందా? అనే విషయంపై మంత్రిని ప్రశ్నిస్తానని’ చెన్నారు.
చదవండి: స్నేహితుడి కుమార్తెపై అత్యాచారం.. సీఎం కేజ్రీవాల్‌ కీలక నిర్ణయం

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)