Breaking News

అహం దెబ్బతిన్న డిప్యూటీ సీఎం?

Published on Sat, 01/11/2025 - 07:47

తిరుమలలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా ఇంకో నలభైమంది గాయపడిన ఘటన కూటమిలో కాకరేపుతోంది. ఘటన జరిగిన మరుక్షణం డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ బయటకు వచ్చి ప్రభుత్వం తరఫున క్షమాపణ చెప్పి మొత్తం అంశాన్ని తాను హైజాక్ చేసారు. అటు చంద్రబాబు ఆ అంశాన్ని నీరుగార్చి చిన్నదిగా చేసి చూపడానికి ప్రయత్నిస్తున్న తరుణంలోనే పవన్ ఏకంగా బహిరంగంగానే క్షమాపణ చెప్పడమే కాకుండా టీటీడీ  చైర్మన్, ఈవో మరికొందరు పెద్దలు దీనికి బాధ్యత వహించాలి అని బాణం సంధించారు. అయితే.. 

దీనికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాత్రం తలబిరుసుతో మాట్లాడుతూ.. ఎవరో ఏదో అన్నారని తానెందుకు స్పందించాలి? అని ప్రశ్నిస్తూనే.. క్షమాపణ చెబితే పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా? అంటూ బాధ్యతా రహితంగా మాట్లాడారు. పవన్ అక్కడితో ఊరుకోకుండా టీటీడీ చైర్మన్ భక్తులకు క్షమాపణ చెప్పాల్సిందే అని మరోసారి పిఠాపురంలో డిమాండ్ చేయడంతో పరిస్థితి మరింత జటిలంగా మారింది. 

టీటీడీ చైర్మన్ విషయంలో పట్టుబట్టినట్లుగా ఉన్న పవన్ ను పదే పదే ఆయన్ను సారీ చెప్పడం కోసం డిమాండ్ చేస్తున్నారు. . ఇదంతా ఒకేగానీ పవన్ ఉన్నఫళంగా టీటీడీ విషయంలో ఇంతగా ఎందుకు పట్టుదలతో ఉన్నారు?. ఆయనకు ఏమైనా ఆత్మాభిమానం గట్రా దెబ్బతిన్నదా ?.. 

మోదీ సభలో ప్రాధాన్యం తగ్గిందా ?
వాస్తవానికి మొన్నటి విశాఖ సభలో ఉంటేగింటే మోదీ తరువాతి ప్రాధాన్యం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబుకు .. రెండో స్థానంలో ఉన్న పవన్‌కు దక్కాలి. కానీ 24 మంది మంత్రుల్లో ఒకరైన లోకేష్ కు అధిక ప్రాధాన్యం దక్కడం పవన్‌కు నచ్చలేదని అంటున్నారు. కేవలం కేబినెట్లో మంత్రిగా ఉన్న లోకేష్‌ను తనతో సమానంగా మోదీ సమక్షంలో కూర్చోబెట్టి అధిక ప్రాధాన్యం ఇవ్వడం అంటే మున్ముందు తనతో సమానంగా.. ఇంకా చెప్పాలంటే తనకు పోటీగా.. లోకేష్ ను తయారు చేస్తూ అవకాశం ఉంటె తనను తొక్కేసేందుకు చంద్రబాబు ఏమాత్రం వెనుకాడడు అని ఇప్పటికే గుర్తించిన పవన్ తన సహజశైలిలో ముందుకు వెళ్తున్నట్లు భావిస్తున్నారు. 

తనను తొక్కేసి లోకేష్‌ను ఎలివేట్ చేసే ప్లాన్లకు తానెందుకు తలొగ్గాలి.. అసలు కూటమి విజయంలో తనదే కీలకపాత్ర అని నమ్ముతున్న పవన్ ఇప్పుడు తెలుగుదేశం చేస్తున్న తప్పులు.. ఆ పార్టీ నాయకులు చేస్తున్న దందాలు చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండకపోవచ్చు.  

అవకాశం దొరికితే మున్ముందు ఇలాంటి అంశాలను బహిరంగంగానే ఖండించి తన వాయిస్ బలంగా వెళ్లేలా చూసుకుని సొంత ఇమేజ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. మున్ముందు పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబు కాలికింద చెప్పులా ఉంటారా? చెప్పులోని రాయిలా మారతారా? చూడాలి..

:::సిమ్మాదిరప్పన్న 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)