Breaking News

అప్పులు మీరు చేస్తే.. వడ్డీలు మేము కడుతున్నాం: భట్టి విక్రమార్క

Published on Fri, 12/06/2024 - 15:46

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అ‍ప్పులు కట్టడానికి కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణను అతలాకుతలం చేసిందంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్ని ఇబ్బందులున్నా.. ప్రభుత్వాన్ని సక్రమ మార్గంలో నడిపిస్తున్నామని చెప్పుకొచ్చారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ..‘గతంలో కేసీఆర్‌ ప్రభుత్వం నిరుద్యోగులను గాలికి వదిలేసింది. మేము 54వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. బీఆర్‌ఎస్‌ పాలనలో పదేళ్లలో రూ.7లక్షల కోట్లు అప్పులు చేశారు. అ‍ప్పులు కట్టడానికి కూడా అప్పులు చేయాలల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు రూ.64వేల కోట్లు అప్పులు చెల్లించాం.

అప్పులు మీరు చేస్తే.. వడ్డీలు మేము కడుతున్నాం. శాలరీలు, పెన్షన్ల కోసం రూ.60 కోట్లు ఖర్చు చేశాం. అధిక పన్నులు వేయకుండానే ప్రతీ పైసా అర్థవంతంగా ఖర్చు చేస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి మంత్రులంతా కృషి చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణను అతలాకుతలం చేసింది. ఎన్ని ఇబ్బందులున్నా.. ప్రభుత్వాన్ని సక్రమ మార్గంలో నడిపిస్తున్నాం. విద్యుత్‌పై భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికబద్దంగా ముందుకెళ్తున్నాం. మేము అధికారంలోకి రాగానే ఆర్థిక వ్యవస్థపై వైట్‌ పేపర్‌ ప్రకటించాం’ అని చెప్పుకొచ్చారు. 

అప్పు లు కట్టడానికి కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)