Breaking News

కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్ధి అధీర్ రంజన్ చౌదరికి నిరసన సెగ

Published on Sat, 04/13/2024 - 21:22

కోల్‌కతా: దేశంలో లోక్‌సభ ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీల అభ్యర్ధులు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రచార జోరును పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, బహరంపూర్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్ధి అధీర్ రంజన్ చౌదరి తన సొంత నియోజక వర్గంలో నిరసన సెగ తగిలింది. 

బహరంపూర్‌లో ప్రచారం చేసి తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అధీర్ రంజన్ చౌదరి వాహనాన్ని నిలిపివేశారు. గోబ్యాక్‌ గోబ్యాక్‌ అంటూ నిలదీశారు. దీంతో ఆగ్రహానికి గురైన అధిర్‌ రంజన్‌ సదరు నిరసన కారులపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో నిరసనకారులు తమ చెంపని చూపిస్తూ కొట్టమని హెచ్చరిస్తున్న విజువల్స్‌ వెలుగులోకి వచ్చాయి. 

అధీర్ రంజన్  తీరుపై పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణముల్‌ కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బహరంపూర్‌లో మీ దౌర్జన్యం సరికాదు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయం మీలో స్పష్టంగా మీ చర్యల ద్వారా కనిపిస్తోంది. కానీ మా కార్యకర్తలను భయపెట్టడానికి కండబలం ఉపయోగించడం మీకు ఏమాత్రం సరైంది కాదని ట్వీట్‌లో తెలిపింది. 

అయితే ఈ వివాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి స్పందించారు. ఇది నన్ను ఆపడానికి చేసిన పన్నాగం తప్ప మరొకటి కాదు. దీని వెనుక అధికార పార్టీ టీఎంసీ ఉంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పని చేయకూడదని వారు కోరుకుంటున్నారు. గత ఏడాది జరిగిన ఓ ఎన్నికల్లో ఇలాగే వ్యవహరించారంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

కాగా 1999 నుంచి బహరంపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వరుస విజయాన్ని సొంతం చేసుకుంటున్న అధీర్ రంజన్ చౌదరిపై అధికార పార్టీ టీఎంసీ తరుపున లోక్‌సభ అభ్యర్ధి ఇండియన్‌ మాజీ క్రికెటర్‌ యూసుఫ్ పఠాన్‌ను రంగంలోకి దించింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)