‘పార్టీ మారే ప్రసక్తే లేదు.. మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారు’

Published on Thu, 10/26/2023 - 10:26

హైదరాబాద్‌: తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. పార్టీ మారుతున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలపై డీకే అరుణ స్పందించారు. 

ఈ విషయంపై పత్రిక ప్రకటన విడుదల చేసిన డీకే అరుణ.. తాను కాంగ్రెస్ పార్టీలో  చేరే ప్రసక్తి లేదని, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. బీజేపీ జాతీయ నాయకత్వం తనను గుర్తించి జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చిందని, మోదీ  నాయకత్వంలో పని చేయడం తన అదృష్టం అని డీకే అరుణ అన్నారు.

మీడియా వారు కనీసం తన స్పందన తీసుకోకుండా  కథనాలు రాయడం సరికాదని డీకే అరుణ  మండిపడ్డారు. తన రాజకీయ భవిష్యత్ నిర్ణయించే హక్కు మీడియాకు ఎవరు ఇచ్చారని, కాంగ్రెస్‌లో తన చేరిక పై దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలను ఆమె ప్రశ్నించారు. తనపై దుష్ప్రచారం చేసిన మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తానని డీకే అరుణ హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: అందులో కూడా కేసీఆరే కనిపిస్తడు కదా?

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)