Breaking News

33 ఏళ్ల తర్వాత రాజ్‌గఢ్‌ నుంచి దిగ్విజయ్‌ సింగ్‌ పోటీ!

Published on Sat, 03/23/2024 - 07:31

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్  రాష్ట్రంలోని రాజ్‌గఢ్ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తాను రాబోయే లోక్‌ సభ ఎన్నికల్లో రాజ్‌గఢ్‌ నుంచి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక్కడి నుంచి పోటీచేయాలని అధిష్ఠానం తనను ఆదేశించిందని తెలిపారు. 

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్ సింగ్ లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొదటి నుండి నిరాకరిస్తూనే వస్తున్నారు. రాజ్యసభలో తన పదవీకాలం ఇంకా రెండేళ్లు ఉందని, అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని గతంలో స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్రంలోని 29 లోక్‌సభ స్థానాలకు బీజేపీ జాబితా విడుదల చేసినా, కాంగ్రెస్ ఇంకా అభ్యర్థుల జాబితా విడుదల చేయలేదు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్‌పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

తాజాగా జరిగిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో పార్టీలోని దిగ్గజ నేతలను రంగంలోకి దింపాలని పార్టీ నిర్ణయించింది. ఈ నేపధ్యంలో రాజ్‌గఢ్ లోక్‌సభ స్థానం నుంచి మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ఈ ప్రకటనతో కాంగ్రెస్‌ మద్దతుదారులు బాణాసంచా కాల్చి,  తమ గెలుపు ఖాయమని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ రాజ్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు దాదాపు 33 ఏళ్ల తర్వాత తిరిగి రాజ్‌గఢ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం గమనార్హం. కాగా ఇవే ఆయనకు ఆఖరి ఎన్నికలు కావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)