Breaking News

మోదీ ‘అన్యాయ్‌కాల్‌’కు కౌంట్‌డౌన్‌ మొదలైంది

Published on Fri, 02/16/2024 - 04:09

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని మోదీ హయాంలోని పదేళ్ల ‘అన్యాయ్‌కాల్‌’కు కౌంట్‌డౌన్‌ మొదలైందని, త్వరలోనే అది ముగుస్తుందని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు దిగ్విజయ్‌సింగ్‌ వ్యాఖ్యానించారు. మోదీ ఇచ్చిన హామీలు గత పదేళ్ల కాలంలో ఒక్కటి కూడా అమలు కాలేదని, కానీ వాగ్దానాలతో చేసిన ఆయన ప్రసంగాలు ఇంకా ప్రజల జ్ఞాపకాల్లో ప్రతిధ్వనిస్తున్నాయని దిగ్విజయ్‌సింగ్‌ పేర్కొన్నారు.

గురువారం ఆయన హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా గాంధీభవన్‌లో విలేకరులతో  మాట్లాడారు. రెండేళ్ల క్రితం ఢిల్లీ శివార్లలో రైతుల ఆందోళన సందర్భంగా పంటలకు మద్దతు ధరపై చట్టబద్ధత కల్పిస్తామని మోదీ ఇచ్చిన హామీని రెండేళ్లయినా పట్టించుకోవడం లేదన్నారు. ఢిల్లీలో రైతుల తాజా ఆందోళనను నిలువరించేందుకు డ్రో న్‌లు ఉపయోగించి గ్యాస్‌ షెల్స్‌ ప్రయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మోదీ పాలనలో గ్యాస్‌ సిలెండర్‌ ధరలు రెండింతలు పెరిగాయని, దేశ అప్పులు మూడు రెట్లు పెరిగాయని, దేశంలోని ఏ ఒక్క వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరని విమర్శించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
 
కాంగ్రెస్‌లో చేరిన నీలం మధు
అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఎస్పీలో చేరిన పఠాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన నీలం మధు గురువారం దీపాదాస్‌మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌ గూటికి చేరుకున్నారు. ఆయనను దీపాదాస్‌మున్షీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)