Breaking News

టీడీపీ–జనసేనలో దీపావళి ‘చిచ్చు’

Published on Tue, 10/29/2024 - 05:36

కాకినాడ: కాకినాడలో కూటమి పార్టీలైన టీడీపీ–జనసేన మధ్య ‘దీపావళి’ చిచ్చు రేపింది. బాణసంచా దుకాణాల కేటాయింపులో అధికా­రుల తీరును తప్పుపడుతూ సిటీ టీడీపీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) వర్గీయులు రోడ్డుపై పడుకుని ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. కాకినాడ నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న ఆర్టీసీ నాన్‌స్టాప్‌ బస్సును అడ్డగించడంతో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది.

ఓ వైపు కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్‌ శ్రీనివాస్‌పై నేరుగా విమర్శలు ఎక్కుపె­డుతూ పనిలో పనిగా ఇక్కడి అధికారులు ఇప్పటికీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కనుసన్నల్లోనే పనిచేస్తున్నారంటూ విమర్శలు చేశారు. ఇప్పటికే పర్లోపేట వద్ద వైన్‌షాపు కేటా­యింపు విషయంలో ఇరుపార్టీల మధ్య వివాదం నెలకొంది. ఇప్పుడు బాణసంచా దుకాణాల కేటాయింపులో కూడా రోడ్డెక్కడంతో టీడీపీ, జనసేన పార్టీల మధ్య నెలకొన్న అంతర్గత పోరు మరోసారి బహిర్గతమైంది. వివరాలివీ.. 

టీడీపీ నగరాధ్యక్షుడు మల్లిపూడి వీరు మద్దతుతో కాకినాడ మెయిన్‌రోడ్డు అపోలో ఆస్పత్రి పక్క ఓ బాణసంచా దుకాణం ఏర్పాటుకు సిద్ధమయ్యారు. చుట్టుపక్కల వ్యాపార సముదాయాలు, వస్త్ర దుకాణాలు, ఆస్పత్రులున్న నేపథ్యంలో అధికారులు ఈ  ప్రతిపాదనను పక్కనపెట్టారు. బాణసంచా దుకాణం కోసం అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాక అధికారులు అభ్యంతరం చెప్పడాన్ని టీడీపీ నగరాధ్యక్షుడు వీరు జీర్ణించుకోలేకపోయారు.

వాస్తవానికి..  జనావాసాల మధ్య దుకాణం ఏర్పాటుపై వివాదం రేగడంతో కలెక్టర్‌ షణ్మోహన్‌ పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక, మున్సిపల్‌ అధికారులతో వేసిన కమిటీ కూడా అక్కడ దుకాణం ఏర్పాటుచేయడంపై అభ్యంతరం తెలిపింది. భానుగుడి జంక్షన్‌ సమీపంలో జనసేన మద్దతుతో ఏర్పాటుచేసిన బాణసంచా దుకాణానికి లేని అభ్యంతరం తమ విషయంలోనే ఎందుకంటూ అధికారులపై మండిపడ్డారు. ఎంపీ ఉదయ్‌శ్రీనివాస్‌ ఒత్తిడితోనే టీడీపీ వారి దుకాణానికి చెక్‌ పెట్టారని వీరు బలంగా అనుమానిస్తున్నారు. దీంతో ఎంపీపై అక్కసు వెళ్లగక్కేందుకు వీరుతోపాటు టీడీపీ శ్రేణులంతా ఆర్డీఓ కార్యాలయం వద్ద రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

దుకాణాల కేటాయింపు తీరుపై విమర్శలు..
మరోవైపు.. గతంలో ఎన్నడూలేని విధంగా కాకినా­డలో బాణసంచా దుకాణాల కేటాయింపు ప్రక్రియ­ను టీడీపీ ఓ ప్రైవేటు లాడ్జిలో నిర్వహించిన తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగే కేటాయింపు ప్రక్రియను హైజా­క్‌ చేసి కొత్త సంస్కృతికి తెరలేపడం వెనుక లక్షలాది రూపాయలు చేతులు మారాయన్న ­విమర్శలు వినిపిస్తున్నాయి.

వారి అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే..
ఇక ప్రభుత్వం మారినా అధికారులు ఇప్పటికీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి మాట విని, పనిచేస్తున్నారంటూ కొండబాబు వర్గీయులు ఆరో­పణలకు దిగారు. దీంతో.. బాణాసంచా దుకా­ణాల కేటాయింపులో వారి అవినీతిని కప్పిపు­చ్చుకునేందుకే ద్వారంపూడిపై విమర్శలు చేస్తున్నా­రని వైఎస్సార్‌సీపీ జేసీఎస్‌ (జగనన్న కన్వీనర్లు, సారథుల) కన్వీనర్‌ సుంకర విద్యాసాగర్‌ మండిపడ్డారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట టీడీపీ నేతలు నిరసన చేసిన తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇలా తరచూ ద్వారంపూడిని వివాదంలోకి లాగడం సర్వసాధారణమైందని విమర్శించారు. దుకాణాల కేటాయింపు అంశంపై ద్వారంపూడి కానీ, వైఎస్సార్‌సీపీ కానీ ఎటు­వంటి ఫిర్యాదులు చేయలేదని స్పష్టంచేశారు.

కాకినాడలో రోడ్డెక్కిన టీడీపీ - జనసేన విభేదాలు

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)