Breaking News

బీజేపీతో పొత్తు: లోక్‌సభ బరిలో దినకరన్‌ పార్టీ.. ఎన్ని సీట్లంటే?

Published on Wed, 03/20/2024 - 20:18

చెన్నై: సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ ఈసారి బోణి చేసి.. అధిక సీట్లు గెలవాలనే లక్ష్యంతో ముందుకువెళ్తోంది. ఈనేపథ్యంలో ఎన్డీయే కూటమిలో భాగంగా.. తమిళనాడు పొత్తులపై ఫోకస్‌ పెట్టింది.  ఇప్పటికే తమిళనాడులో పీఎంకే (పట్టాలి మక్కళ్ కట్చి) పార్టీతో బీజేపీ పొత్తు ఖరారైంది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో పీఎంకే పార్టీకి 10 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించిన విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ.. అమ్మ మక్కల్‌ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే)తో పొత్తులో భాగంగా సీట్ల పంపకం ఖరారు చేసింది. బీజేపీ ఏఎంఎంకేకు రెండు సీట్లు కేటాయించినట్లు ఆ పార్టీ చీఫ్‌​ టీటీవీ దినకరన్‌ బుధవారం వెల్లడించారు. 

‘బీజేపీ మా పార్టీకి ఎక్కువ సీట్లు ఇవ్వడానికే మొగ్గు చూపింది. కానీ, మాకు కేవలం రెండు సీట్ల మాత్రమే కావాలని కోరాం. మా అభిప్రాయాన్ని పరిగణలోకి బీజేపీ మాకు రెండు సీట్లు కేటాయించింది. మాకు సీట్ల సంఖ్య పాధాన్యం కాదు.. మాకే ఎన్డీయే కూటమి  భారీ విజయం సాధించటమే ముఖ్యం’ అని టీటీవీ దినకరన్‌ అన్నారు. ఏయే పార్లమెంట్‌ నియోజకవర్గాలను తమకు కేటాయిస్తారమే విషయాన్ని బీజేపీ వెల్లడిస్తుందని తెలిపారు. తమిళనాడులో బీజేపీ గణనీయమైన ఎదుగుదలను కనబరుస్తోందని తెలిపారు.  అయితే తమ పార్టీ గుర్తు కుక్కర్‌ కేటాయింపు విషయంలో  ఎన్నికల సంఘం నిర్ణయం కోసం  ఎదురుచూస్తున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా ఏఐఏడీఎంకే పార్టీపై దినకరన్‌ విమర్శలు చేశారు.  ఆ పార్టీ రోజురోజుకుగా ప్రభావం కోల్పోతోందన్నారు.  కేవలం కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం ఆ పార్టీ పనిచేస్తోందని అన్నారు.  పరోక్షంగా ఏఐఏడీఎంకే పార్టీ జనరల్‌ సెక్రటరీ  ఎడప్పాడి పళనిస్వామిపై విమర్శలు చేశారు. దినకరన్‌.. ఏఐఏడిఎంకే పార్టీ నుంచి 2017లో బయటకు వచ్చి ఏఎంఎంకే పార్టీన స్థాపించిన విషయం తెలిసిందే. ఇక.. తమిళానాడు ఇప్పటివరకు  బీజేపీ ఒక్కస్థానంలో కూడా గెలుపొందకపోటం  గమనార్హం.  2019లో లోకసభ ఎన్నికల్లో సైతం ఎన్డీయే మిత్రపక్ష పార్టీ ఏఐఏడిఎంకే పార్టీ ఒక సీటు గెలుచుకుంది.

చదవండి:  కాంగ్రెస్‌లో చేరిన బీఎస్పీ సస్పెండెడ్‌ ఎంపీ

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)