Breaking News

చేరికల చిచ్చు.. ఒక్క రోజుకే కాంగ్రెస్‌కు డీఎస్‌ రాజీనామా.. అసలేమైంది?

Published on Mon, 03/27/2023 - 16:48

సాక్షి, హైదరాబాద్‌: మాజీ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ కుటుంబంలో చేరికల చిచ్చు చెలరేగింది. నిన్న (ఆదివారం)డీఎస్‌, ఆయన కుమారుడు సంజయ్‌ తిరిగి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. అయితే సొంతగూటికి చేరిన ఒక్కరోజుకే(సోమవారం) ఆ పార్టీకి రాజీనామా చేస్తునట్లు డీఎస్‌ ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన లేఖ రాశారు. డీఎస్‌ లేఖ రాస్తున్న వీడియోను కూడా విడుదల చేశారు.
రాజీనామా లేఖను ఆయన సతీమణి విజయలక్ష్మి మీడియాకు విడుదల చేశారు. డీఎస్‌ ఆరోగ్యం సహకరించట్లేదని, కాంగ్రెస్‌ వాళ్లు తమ ఇంటి వైపుకు రావొద్దని డీఎస్‌ భార్య విజ్ఞప్తి చేశారు. కాగా తొలుత కాంగ్రెస్‌ నేత అయిన డీఎస్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ చీఫ్‌గా పనిచేశారు. రాష్ట్ర విభజన తరువాత టీఆర్‌ఎస్‌(ప్రస్తుత బీఆర్‌ఎస్‌) పార్టీలో చేరి రాజ్యసభ ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. 
కొంతకాలంగా బీఆర్ఎస్‌కు ఆయన దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం తన కొడుకు సంజయ్‌తో కలిసి గాంధీభవన్‌కు వచ్చిన డీఎస్‌.. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే మరుసటి రోజే కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం సంచలనంగా మారింది. కాగా డీఎస్‌ మరో కొడుకు అర్వింద్‌ బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు.

కాగా ‘కొడుకు సంజయ్‌ కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా ఆశీస్సులు ఇవ్వడానే గాంధీభవన్‌కు వచ్చాను. కానీ తాను కూడా మళ్లీ పార్టీలో చేరినట్టుగా మీడియాలో ప్రచారం చేశారు. నేను ఎపన్పటికీ కాంగ్రెస్‌ వాదినే కానీ.. ప్రస్తుతం నా వయస్సు, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. పార్టీలో నా చేరికకూ, నా కుమారుడు సంజయ్‌ టికెట్‌కు ముడిపెట్టడం భావ్యం కాదు. నన్ను వివాదాల్లోకి లాగవద్దని విజ్ఞప్తి. కాంగ్రెస్‌ పార్టీలో నేను మళ్లీ చేరానని మీరు భావిస్తే ఈ లేఖను రాజీనామాగా భావించి ఆమోదించవలసిందిగా కోరుకుంటున్నాను’ అని లేఖలో పేర్కొన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)