రేపే సీఎంగా ప్రమాణ స్వీకారం.. పేరు మార్చుకున్న దేవేంద్ర ఫడ్నవీస్‌

Published on Wed, 12/04/2024 - 14:56

ముంబై : మహరాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి దేవేంద్ర గంగాధర్‌ ఫడ్నవీస్‌ అధికారికంగా తన పేరును మార్చుకున్నారు.

మహరాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుపై గత కొంత కాలంగా కొనసాగుతున్న ఉత్కంఠతకు ఎట్టకేలకు తెరపడింది. రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్‌ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ పేరు ఖరారైంది. బుధవారం జరిగిన బీజేపీ కోర్‌ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌ పేరుకు ఆమోదం లభించింది. దీంతో ఫడ్నవీస్‌ రేపు (డిసెంబర్‌5న) ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

ముంబై ఆజాద్‌ మైదానంలో ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు ముమ్మరం కొనసాగుతున్నాయి.ఈ ప్రమాణ స్వీకారంలో  ప్రముఖుల్ని ఆహ్వానిస్తూ మహరాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ సుజాతా సౌనిక్‌ ఇన్విటేషన్లను సిద్ధం చేశారు. ఆ ఇన్విటేషన్‌లలో  దేవేంద్ర గంగాధర్‌ ఫడ్నవీస్‌ బదులు ‘దేవేంద్ర సరిత గంగాధరరావు ఫడ్నవీస్‌’పేరుతో ఇన్విటేషన్లు పంపిస్తున్నారు.దీంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని సైతం దేవేంద్ర సరితా గంగాధరరావు ఫడ్నవీస్‌ పేరుతో సిద్ధం చేస్తున్నారు.

అఫిడవిట్‌లో 
మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ)కి దేవేంద్ర గంగాధర్‌ ఫడ్నవీస్‌ పేరుతో  అఫిడవిట్‌లను సమర్పించారు.2014,2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఫడ్నవీస్‌ తన తల్లిదండ్రుల పేర్లను ప్రస్తావించలేదు. కానీ ఈ సారి అనూహ్యంగా తల్లి,తండ్రి పేరు కలిసేలా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు.

యుక్త వయస్సులో తండ్రి దూరమై..  
ఫడ్నవీస్‌ తల్లిపేరు సరితా ఫడ్నవీస్‌,తండ్రి  గంగాధర్ ఫడ్నవీస్. బీజేపీలో ఎమ్మెల్సీగా చేశారు. ఫడ్నవీస్‌ యుక్త వయస్సులో ఉన్నప్పుడే తండ్రి గంగాధర్ ఫడ్నవీస్ క్యాన్సర్‌ కారణంగా మరణించారు. ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవిస్ బ్యాంకర్,సామాజిక కార్యకర్తగా పని చేస్తున్నారు.  ఫడ్నవీస్‌ దంపతులకు కుమార్తె దివిజ ఉన్నారు. 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)