Breaking News

దేవానంద్‌ పార్టీ ఎందుకు పతనమైంది?

Published on Thu, 04/18/2024 - 14:37

సినీతారలు రాజకీయాల్లోనూ తళుక్కుమని మెరుస్తుంటారు. ఈ కోవలో బాలీవుడ్‌  ఎవర్ గ్రీన్ నటుడు దేవానంద్‌ కూడా వస్తారు. ఆయన ఎంతో ఉత్సాహంతో రాజకీయాల్లో కాలుమోపారు. అధికారికంగా పార్టీని స్థాపించి, ముంబైలోని శివాజీ పార్క్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. పార్టీ మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. 

అవి 1975.. ఎమర్జెన్సీ  రోజులు.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి దేశం మొత్తం ఉలిక్కిపడింది. దీనిలో సినిమా ప్రపంచానికీ మినహాయింపేమీ లేదు. 1977లో ఎమర్జెన్సీ తర్వాత వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారం నుంచి దింపేందుకు సినీ తారలు ఏకమై జాతీయ పార్టీని స్థాపించాలనుకున్నారు. పార్టీ అధ్యక్షునిగా నటుడు దేవానంద్‌ను ఎన్నుకున్నారు.

1979లో జనతా ప్రభుత్వం కూలిపోయి, ఎన్నికలు ప్రకటన వచ్చినప్పుడు బాలీవుడ్ నటులు రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. అదే ఏడాది సెప్టెంబర్ 4న ముంబైలోని తాజ్ మహల్ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ‘నేషనల్ పార్టీ’ని ఏర్పాటు చేస్తున్నట్లు దేవానంద్‌ ప్రకటించారు. పార్టీ మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు.

పార్టీ ప్రధాన కార్యాలయం ముంబై పరేల్‌లోని వి శాంతారామ్ రాజ్‌కమల్ స్టూడియోలో ఏర్పాటుచేశారు. దేవానంద్, అతని సోదరుడు విజయ్ ఆనంద్, నిర్మాత,దర్శకుడు వి. శాంతారామ్, జీపీ సిప్పీ, శ్రీరామ్ బోహ్రా, ఐఎస్ జోహార్, రామానంద్ సాగర్, ఆత్మారామ్, శత్రుఘ్న సిన్హా, ధర్మేంద్ర, హేమా మాలిని, సంజీవ్ కుమార్ తదితులు పార్టీ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొనేవారు. వీరంతా దేవానంద్‌కు అండగా నిలిచారు. 

సినీ పరిశ్రమతో అనుబంధం ఉన్నవారి పార్టీ కావడంతో పెద్ద ఎత్తున జనం పార్టీలో చేరారు. దీంతో జనతా ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్‌లో ఆందోళన చెలరేగింది. ‘నేషనల్ పార్టీ’ ముంబైలోని శివాజీ పార్క్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభ విజయవంతమైంది.  అదే సమయంలో ప్రముఖ నటుడు ఐఎస్ జోహార్ తాను జనతా ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రి రాజ్ నారాయణ్‌పై ఎన్నికల్లో పోటీ చేసి ఘోరంగా ఓడిస్తానని సవాల్‌ చేశారు. 

అతని ప్రకటనపై ఆగ్రహించిన రాజ్ నారాయణ్ జోహార్ ఇకపై ఇలాంటి చేష్టలను మానుకోకపోతే, చేతులు కాళ్లు విరగ్గొడతానని జోహార్‌ను హెచ్చరించారట. దీనికితోడు ‘నేషనల్ పార్టీ’కి వస్తున్న ఆదరణకు అడ్డుకట్ట వేయకపోతే తమ మనుగడకు ఇబ్బంది ఏర్పడుతుందని భావించిన జనతా ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు.. పలువురు నటులను తమవైపు తిప్పుకున్నారట. దీంతో ‘నేషనల్ పార్టీ’లో అంతవరకూ చురుగ్గా ఉన్న సినీ కళాకారులు  ఒక్కొక్కరుగా పార్టీ నుంచి వైదొలగారట. చివరికి దేవానంద్ ఒంటరిగా మిగిలిపోయారట. అటువంటి పరిస్థితిలో ఆయన ‘నేషనల్ పార్టీ’ని ముందుకు తీసుకువెళ్లలేకపోయాట.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)