Breaking News

బీఆర్‌ఎస్‌ పాలనలో వామనావతారంలాగా అప్పులు: భట్టి

Published on Thu, 07/25/2024 - 13:01

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రసంగంలో బీఆర్‌ఎస్‌ పాలనను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క  తీవ్రంగా తప్పుబట్టారు. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, తాము మాత్రం జనరంజకమైన బడ్జెట్‌ ద్వారా ప్రజల ముందుకు వస్తున్నామని అన్నారాయన. 

‘‘గత ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అప్పుడు పది రేట్లు పెరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఉద్యోగాలు, నీళ్లు దక్కలేదు. బంగారు తెలంగాణ చేస్తామని ఉత్తరకుమార ప్రగల్బాలు పలికారు. కానీ, బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం అప్పులపాలైంది. వామనావతారం లెక్క అప్పులు పెరిగాయి. ఒంటెద్దు పోకడలతో ఆర్ధిక వ్యవస్థను నిర్వీర్యం చేశారు. అప్పులు పెరగడంతో పాటుగా బిల్లులు బకాయిలు భారీగా పెరిగిపోయాయి. కొత్త ఉద్యోగాలు సృష్టించడం కాదు.. ఉన్న ఉద్యోగాలే ఇవ్వలేదు. దశాబ్ద కాలంలో తెలంగాణ పురోగమించలేదు. జీతాలు, పెన్షన్లు చెల్లింపులు కూడా చేయలేని పరిస్థితి. ఆర్థిక క్రమ  శిక్షణ పాటించకుండా తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారు.  పదేళ్ల అస్తవ్యస్త పాలనకు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారు. 

కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక.. దుబారా ఖర్చు ఆపేసి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాం. రాష్ట్రంలో ఏర్పడిన పదేళ్ల తర్వాత వాస్తవిక బడ్జెట్‌ ప్రవేశపెట్టాం. త్వరలో జాబ్‌ క్యాలెండర్ ప్రకటిస్తాం. ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తాం. ఏదో విధంగా ఎన్నికల్లో గెలవాలిని మేము హామీలు ఇవ్వలేదు. ప్రజల గుండె చప్పుళ్లకు స్పందించే హామీలు ఇచ్చాం. మేం అధికారంలోకి వచ్చాక 31,768 ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాం. డిసెంబర్‌ నుంచి పథకాల కోసం రూ.34,579 కోట్లు ఖర్చు చేశాం. ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. ఆరోగ్యశ్రీని రూ. 10 లక్షలకు పెంచాం. నా తెలంగాణ కోటి రతనాల వీణ. ఎన్నో ఏళ్లు ప్రజలు ఉద్యమం చేశారు అని భట్టి అన్నారు. 

ఒకానొక దశలో బడ్జెట్ ప్రసంగానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు నినాదాలు చేశారు. అయినా భట్టి తన ప్రసంగం కొనసాగించారు.

2024-2​‍5 బడ్జెట్‌ ప్రసంగాన్ని కొనసాగిస్తూ... ‘ఆయిల్‌ పామ్‌ సాగుకు రైతులకు అవసరమైన సాయం అందిస్తాం. రాష్ట్రంలో లక్ష ఎకరాల ఆయిల్‌ పామ్‌ సాగును లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎల్బీనగర్‌ నుంచి హయత్‌ నగర్‌ వరకు, పాతబస్తీ మీదుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు మెట్రోను విస్తరిస్తాం. మియాపూర్‌ నుంచి పటాన్‌చెరు వరకు మెట్రోను విస్తరిస్తాం. ఉచిత బస్సులు పథకం రాష్ట్ర అభివృద్ధి సాయపడుతోంది’ అని తెలిపారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)